T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. అదేంటేంటే?

| Edited By: Venkata Chari

Sep 24, 2024 | 11:02 AM

T20 World Cup 2024: క్రికెట్ చరిత్రలో ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రైజ్ మనీ ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించుకుంది. బహుమతులు సమానంగా ఉండాలని మంగళవారం ప్రకటించింది. 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ మొదలుకొని ఈ నిర్ణయం అమలులోకి రానుంది. పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లకు సమానమైన నగదు బహుమతులు ఇవ్వనున్నారు మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచారు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. అదేంటేంటే?
Women's T20 World Cup
Follow us on

T20 World Cup 2024: క్రికెట్ చరిత్రలో ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రైజ్ మనీ ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించుకుంది. బహుమతులు సమానంగా ఉండాలని మంగళవారం ప్రకటించింది. 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ మొదలుకొని ఈ నిర్ణయం అమలులోకి రానుంది. పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లకు సమానమైన నగదు బహుమతులు ఇవ్వనున్నారు మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచారు. ఇది సమానత్వానికి దారితీస్తుంది. పురుషుల ప్రపంచ కప్‌లో భారీ నగదు బహుమతులు ఇచ్చినట్లుగా, ఇప్పుడు మహిళల ప్రపంచ కప్‌లో కూడా అదే వర్తించనుంది. 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ ఈ నిర్ణయం అమలులో మొదటి ఐసీసీ ఈవెంట్‌గా ఉంటుందని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది.

2023లో సౌతాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా మహిళల జట్టు అందుకున్న నగదు బహుమతి మొత్తంలో 17.7 శాతం పెరుగుదల కనిపించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయంతో 7.23 మిలియన్ డాలర్ల బహుమతి ఆ టీంకు లభించింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన భారత జట్టు 2022లో 2.45 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని అందుకుంది.

ఐసీసీ తన ప్రకటనలో “2024 మహిళల టీ20 ప్రపంచ కప్ ఈ నిర్ణయం అమలులోకి వచ్చే మొదటి ఐసీసీ ఈవెంట్‌ అవుతుంది. ఆ ఈవెంట్‌లో మహిళల జట్లు తమ పురుష మాదిరిగానే నగదు బహుమతులు పొందుతాయి. ఇది క్రీడా చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి” అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయం మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం ఇవ్వడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇదివరకు పురుషులకు ఎక్కువ నగదు బహుమతులు లభించేవి. అయితే ఇప్పుడు మహిళలు కూడా అదే స్థాయిలో నగదు బహుమతులు పొందుతారు. ఇది క్రికెట్‌లో లింగ సమానత్వానికి ఊతమిచ్చే చారిత్రాత్మక చర్యగా ప్రశంసలు పొందుతుంది.

మహిళా ఆటగాళ్ళు ఇప్పుడు పురుషులతో సమాన హక్కులు, అవకాశాలు, నగదు బహుమతులు పొందడమే కాకుండా, వారి కృషికి న్యాయం జరుగుతున్నట్లుగా భావిస్తారు. మహిళల క్రికెట్ పురోగతిని చూడటానికి ఇదో అద్భుత అవకాశంగా మారింది. ఇది క్రీడా సమాజంలో ఒక ముఖ్యమైన మార్పు. ఇప్పటికే పురుషులతో సమానంగా మహిళ క్రికెటర్లకు చెల్లించే కాంట్రాక్ట్ ఫీజు విషయంలో గతంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..