5 Unknown Facts About Sachin Tendulkar: ఈరోజు టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. సచిన్ టెండూల్కర్ 24 ఏప్రిల్ 1973 న జన్మించాడు. ఇప్పుడు అతని వయస్సు 51 సంవత్సరాలు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటి వరకు కొన్ని రికార్డులను ఏ బ్యాట్స్‌మెన్ బ్రేక్ చేయలేకపోయాడు. 100 సెంచరీల రికార్డు అతని పేరు మీద ఉంది. దానిని బద్దలు కొట్టడం చాలా కష్టంగా మారింది.
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎలాంటి రికార్డులు సృష్టించాడో అందరికీ తెలిసిందే. అయితే సచిన్ పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్‌కు సంబంధించిన కొన్ని విషయాల గురించి కొన్ని స్పెషల్ విషయాలను తెలుసుకుందాం.. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
6⃣6⃣4⃣ intl. matches 👍
3⃣4⃣,3⃣5⃣7⃣ intl. runs 🙌
2⃣0⃣1⃣ intl. wickets 👌
2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆The only cricketer to score 💯 intl. hundreds 🫡
Here’s wishing the legendary @sachin_rt a very Happy Birthday! 🎂👏#TeamIndia pic.twitter.com/2k0Yl9R25S
— BCCI (@BCCI) April 24, 2024
1. 1987 ప్రపంచకప్‌లో బాల్‌బాయ్‌గా పనిచేసిన సచిన్..
1987 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ బాల్ బాయ్‌గా పనిచేశాడు. అప్పటికి అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత, అతను అదే మైదానంలో చాలా మంది లెజెండ్‌లతో మ్యాచ్‌లు కూడా ఆడాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఘనత సాధించాడు.
2. పాకిస్థాన్ తరపున ఫీల్డింగ్ చేసిన మాస్టర్..
సచిన్ టెండూల్కర్ కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ చేశాడని చాలా మందికి తెలియదు. 1988లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ తరపున ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ చేశాడు.
3. కేవలం 14 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీ బరిలో..
సచిన్ టెండూల్కర్ తన 14 ఏళ్ల వయసులో రంజీ అరంగేట్రం చేశాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలా చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగానూ రికార్డ్ నెలకొల్పాడు.
4. భారతరత్న పొందిన తొలి భారతీయ అథ్లెట్..
భారతరత్న పొందిన తొలి భారతీయ ఆటగాడు సచిన్ టెండూల్కర్. 2014లో దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు.
5. క్రికెట్ చరిత్రలో థర్డ్ అంపైర్ ద్వారా అవుట్ అయిన తొలి ఆటగాడిగా..
క్రికెట్ చరిత్రలో థర్డ్ అంపైర్‌గా అవుట్ అయిన తొలి ఆటగాడు సచిన్ టెండూల్కర్ నిలిచాడు. థర్డ్ అంపైర్ రూల్ 1992లో ప్రవేశపెట్టారు. థర్డ్ అంపైర్ అవుట్ చేసిన మొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డులకు ఎక్కాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..