Dhammika Niroshana: శ్రీలంక క్రికెటర్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే కాల్చివేత.. కారణమిదే

|

Jul 18, 2024 | 8:34 AM

శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషణ (41) దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండుగులు భార్య పిల్లల ఎదుటే అతనిని కాల్చి చంపేశారు. శ్రీలంకలోని గల్లే అంబలంగోడలో బుధవారం (జులై 17) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక అండర్-19 జట్టుకు నిరోషణ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు

Dhammika Niroshana: శ్రీలంక క్రికెటర్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే కాల్చివేత.. కారణమిదే
Dhammika Niroshana
Follow us on

శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషణ (41) దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండుగులు భార్య పిల్లల ఎదుటే అతనిని కాల్చి చంపేశారు. శ్రీలంకలోని గల్లే అంబలంగోడలో బుధవారం (జులై 17) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక అండర్-19 జట్టుకు నిరోషణ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మీడియా కథనాల ప్రకారం, మంగళవారం రాత్రి నిరోషన్ ఇంట్లోకి దుండగులు చొరబడి అతని భార్య, పిల్లల ముందే కాల్చి చంపారు. ఇప్పటికే కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హంతకుల కోసం గాలింపు ప్రారంభించారు. నిరోషన్ హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా కనుగొనలేదు. అయితే నిరోషణపై కాల్పులు జరిపినప్పుడు అతని భార్య, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరపడంతో నిరోశన అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం క్రికెటర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

ధమ్మిక నిరోషణ శ్రీలంక అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించచాడు. కానీ అతనికి సీనియర్‌ జట్టులో ఆడే అవకాశం లభించలేదు. నిరోషనా కుడిచేతి ఫాస్ట్ బౌలర్‌ తో పాటు లోయర్-ఆర్డర్ బ్యాటర్ కూడా. అతను 2001- 2004 మధ్య కాలంలో గాలే క్రికెట్ క్లబ్ తరపున 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 8 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. నిరోషనా 2000లో శ్రీలంక అండర్-19 జట్టుకు అరంగేట్రం చేసి, శ్రీలంక అండర్-19 జట్టుకు 2 సంవత్సరాలు ఆడాడు. ఈ కాలంలో 10 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఏంజెలో మాథ్యూస్, ఉపల్ తరంగ వంటి శ్రీలంక స్టార్ ఆటగాళ్లు ధమ్మిక కెప్టెన్సీలో ఆడారు. నిరోషన్ చివరకు డిసెంబర్ 2004లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

భారత ఆటగాళ్లతో కలిసి క్రికెట్..

ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్ని, మన్విందర్ బిస్లాలతో కూడిన భారత అండర్-19 జట్టుతో ధమ్మిక నిరోషణ క్రికెట్ ఆడడాడు. 2002లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టుకు ధమ్మిక నిరోషణ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..