ఒక్కో బంతికి రూ. 3 లక్షల సంపాదన.. ఈ ఫినిషర్ లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే..!

Donovan Ferreira The Hundred: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 'ది హండ్రెడ్‌' లీగ్‌లో దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాటర్ డోనోవన్ ఫెరీరా సృష్టించిన విధ్వంసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం కొద్ది బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్న ఈ హిట్టర్ సంపాదన కళ్ళు చెదిరేలా ఉంది. అతడు ఆడిన ఒక్కో బంతికి లక్షల్లో ఆదాయం రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఒక్కో బంతికి రూ. 3 లక్షల సంపాదన.. ఈ ఫినిషర్ లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే..!
Donovan Ferreira The Hundred

Updated on: Aug 18, 2026 | 5:33 PM

Donovan Ferreira The Hundred: పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడూ డాషింగ్ బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఆటగాళ్లకు క్రికెట్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఫ్రాంచైజీలు సైతం ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ల కోసం ఎగబడి మరీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు దక్షిణాఫ్రికా విధ్వంసకర ఫినిషర్ డోనోవన్ ఫెరీరా విషయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారాడు. ఈ అసాధారణ హిట్టింగ్ నైపుణ్యంతో 2026 హండ్రెడ్ సీజన్ వేలానికి అతడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 2,71,76,436 భారీ ధర వెచ్చించి అతడిని దక్కించుకుంది. ఆటగాడిగా జట్టులోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది.

ఒక్కో బంతికి మూడు లక్షల ఆదాయం..

క్రికెట్‌లో బంతుల లెక్కన ఆదాయం చూస్తే ఫెరీరా సంపాదన అభిమానుల మైండ్‌బ్లాంక్ చేస్తుంది. 2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ అతనికి 52 వేల పౌండ్లు చెల్లించింది. అంటే మైదానంలో అతను ఆడిన ఒక్కో బంతికి సుమారు రూ. 89,294 చొప్పున ముట్టాయి. అదే 2026 సీజన్‌లో బర్మింగ్‌హామ్ జట్టు నుంచి అందిన భారీ మొత్తంతో ఈ లెక్కలు ఆకాశాన్ని తాకాయి. కెప్టెన్‌గా 8 మ్యాచ్‌ల్లో 90 బంతులు ఆడి 101 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో సైతం 40 బంతులు వేశాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే, ఈ ఏడాది అతడు మైదానంలో ఎదుర్కొన్న ఒక్కో బంతికి ఏకంగా రూ. 3,01,960 చొప్పున ఆదాయం దక్కింది. ఇలా బంతికి లక్షల్లో ఆర్జించడం లీగ్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..!

కళ్ళు చెదిరే స్ట్రైక్ రేట్..

గతంలో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు ఆడిన ఫెరీరా గణాంకాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 69 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కానీ క్రీజులో ఉన్న కాసేపూ ఏకంగా 245 స్ట్రైక్ రేట్‌తో విజృంభించి 169 పరుగులు రాబట్టాడు. ఇందులో 17 భారీ సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. తాను సాధించిన మొత్తం స్కోరులో 142 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం అతడి హిట్టింగ్ పవర్‌కు నిదర్శనం. ప్రతి నాలుగు బంతులకు ఒక బౌండరీ బాదుతూ బౌలర్ల వ్యూహాలను పూర్తిగా చిత్తు చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చి ఇలాంటి విధ్వంసం సృష్టించడం వల్లే అతడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..!

మొత్తానికి తక్కువ బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా డోనోవన్ ఫెరీరాను కోటీశ్వరుణ్ణి చేసింది. ఫినిషర్లకు ఉండే డిమాండ్‌ను ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాబోయే టోర్నీల్లోనూ అతను ఇదే జోరు కొనసాగిస్తే ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం ఖాయం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us