Yuzvendra Chahal and Dhanashree Verma: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్ తన భార్య ధన్‌శ్రీ వర్మకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సెలబ్రిటీ జంట త్వరలో విడిపోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చాహల్ కానీ, ధన్‌శ్రీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రూమర్ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ధన్‌శ్రీ వర్మ తన మౌనాన్ని వీడారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై కూడా సీరియస్ అయింది.
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాల మధ్య జనవరి 8న ధన్‌శ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రకటనను పంచుకుంది. గత కొన్ని రోజులుగా నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. నిరాధారమైన రాతలు, వాస్తవాలను తనిఖీ చేయకుండా రాసే రాతలు, ద్వేషపూరిత ట్రోల్స్‌తో నా గౌరవానికి భంగం కలిగిస్తున్నారు.
‘ఇప్పుడున్న పేరు, కీర్తిని సంపాదించడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం నా బలహీనత కాదు. అదే నా బలం. ప్రతికూలత ఆన్‌లైన్‌లో సులభంగా వ్యాపిస్తుంది. ఇది ఇతరులను పైకి లేపడానికి ధైర్యాన్ని ఇస్తుంది’ అంటూ రాసుకొచ్చింది.
‘నేను నా విలువలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి ఆధారాలు లేకపోయినా సత్యం దాని స్థానంలో స్థిరంగా నిలుస్తుంది. ఓం నమః శివాయ’ అంటూ ట్రోలర్స్‌కు షాక్ ఇచ్చింది.
ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత, ధన్‌శ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ మధ్య సంబంధాలపై ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ధన్‌శ్రీ వర్మ తన పోస్ట్‌లో దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
అలాగే యుజ్వేంద్ర చాహల్ పేరును ప్రస్తావించలేదు. అలా సెలబ్రిటీ జంట మధ్య ఏకాభిప్రాయం కుదరలేదనే వార్త మళ్లీ తెరపైకి వచ్చింది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020 లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..