Ashes 2021: 85 ఏళ్ల తరువాత తొలి బంతికే వికెట్.. యాషెస్ చరిత్రలో నాలుగో సారి.. ఇంగ్లండ్‌కు సొంతమైన 23 ఏళ్ల చెత్త రికార్డు..!

|

Dec 08, 2021 | 11:17 AM

AUS vs ENG, Ashes 1st Test: 1936లో యాషెస్ లో అంటే 85 ఏళ్ల తర్వాత మ్యాచ్ తొలి బంతికే వికెట్ పడింది. 139 ఏళ్ల యాషెస్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. ఈ సిరీస్ మొదటిసారి 1882లో ఆడారు.

Ashes 2021: 85 ఏళ్ల తరువాత తొలి బంతికే వికెట్.. యాషెస్ చరిత్రలో నాలుగో సారి.. ఇంగ్లండ్‌కు సొంతమైన 23 ఏళ్ల చెత్త రికార్డు..!
Ashes 2021
Follow us on

AUS vs ENG, Ashes 1st Test: ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య అత్యంత పురాతన క్రికెట్ పోరుగా భావించే యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. ఇంగ్లండ్‌కు పేలవమైన ఆరంభం లభించడంతో మిచెల్ స్టార్క్ తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్‌ను బౌల్డ్ చేసి మ్యాచ్‌లో ఉత్సాహాన్ని నింపాడు. 1936లో యాషెస్ లో అంటే 85 ఏళ్ల తర్వాత మ్యాచ్ తొలి బంతికే వికెట్ పడింది. 139 ఏళ్ల యాషెస్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. ఈ సిరీస్ మొదటిసారి 1882లో ఆడారు.

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రూట్ తీసుకున్న ఈ నిర్ణయం ఆస్ట్రేలియా బౌలర్ల ముందు తప్పని రుజువైంది. తొలి బంతికే స్టార్క్ రోరీ బర్న్స్ స్టంప్‌లను చెదరగొట్టాడు. బర్న్స్ ఈ సీజన్‌లో ఆరోసారి పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ 6 ఓవర్లకు 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. గంట వ్యవధిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బర్న్స్, కెప్టెన్ జో రూట్ సున్నా వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో డేవిడ్ మలన్ 9 బంతుల్లో 6 పరుగుల వద్ద ఔటయ్యాడు.

టాప్ ఆర్డర్ నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్ 5 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత స్టోక్స్ కూడా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ, అతను కూడా వెంటనే ఔటయ్యారు. 29 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. స్టోక్స్ 21 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో తొలిసారి జీరోకే రూట్ ఔట్..
జో రూట్ ఈ ఇన్నింగ్స్‌కు ముందు 2021లో 6 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సహాయంతో 1455 పరుగులు చేశాడు. అతను 228 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఆస్ట్రేలియాపై విఫలమయ్యాడు. రూట్ ఈ ఏడాది తొలిసారి సున్నాకి ఔటయ్యాడు.

ఈ సీజన్‌లో ఏడుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 29 సార్లు సున్నాకి ఔట్..
ఈ ఏడాది ఇంగ్లండ్ టాప్-7 బ్యాట్స్‌మెన్ 29 సార్లు సున్నాకి ఔట్ అయ్యారు. ఇది ప్రపంచ రికార్డు. ఇంతకుముందు 1988లో కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అత్యధికంగా 27 సార్లు సున్నాకి ఔటయ్యారు. అంటే ఆ జట్టు మళ్లీ 23 ఏళ్ల తరువాత చెత్త రికార్డు సృష్టించారు.

Also Read: IND VS SA: ‘ఆ నలుగురు’ చాలా ప్రమాదకరం.. టీమిండియాకు తలనొప్పిగా మారనున్న ఆటగాళ్లు ఎవరంటే?

Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పోరు వెనుక ఇంత స్టోరీ ఉందా? యాషెస్ చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..!