IND vs PAK: భారత్, పాక్ పోరుకు రెడీ.. ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే..!

Asian Games 2026 Cricket Schedule: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్, డ్రాను అధికారికంగా విడుదల చేశారు. జపాన్‌లో జరిగే ఈ క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అయితే, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ బిగ్ ఫైట్ మాత్రం కేవలం సెమీఫైనల్ లేదా ఫైనల్లోనే సాధ్యమవుతుంది.

IND vs PAK: భారత్, పాక్ పోరుకు రెడీ.. ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే..!
Ind Vs Pak Asian Games

Updated on: Jul 24, 2026 | 1:48 PM

Asian Games 2026 Cricket Schedule: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది..! జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ డ్రాను అధికారులు ప్రకటించారు. గతంలో గ్వాంజూ (2010), ఇంచియాన్ (2014), హాంగ్‌జౌ (2023) తర్వాత క్రికెట్ ఆసియా క్రీడల్లో చోటు దక్కించుకోవడం ఇది నాలుగోసారి.

టోర్నీ వివరాలు, వేదిక..

ఫార్మాట్: పురుషుల, మహిళల టోర్నీలు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. వీటికి అంతర్జాతీయ టీ20 హోదా ఉంటుంది.

మహిళల టోర్నీ: సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 22 వరకు.

పురుషుల టోర్నీ: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు.

వేదిక: ఐచి ప్రిఫెక్చర్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్.

భారత్‌కు నేరుగా క్వార్టర్స్ టికెట్..!

గత ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా (పురుషులు, మహిళలు) నేరుగా క్వార్టర్ ఫైనల్ దశ నుంచే టోర్నీని ప్రారంభించనుంది.

పురుషుల విభాగంలో టాప్ సీడ్స్: భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఎంట్రీ లభించింది.

మిగిలిన స్థానాలు: ప్రిలిమినరీ రౌండ్ ద్వారా మరో 4 జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్ ఎ: అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్

గ్రూప్ బి: హాంగ్‌కాంగ్ చైనా, మలేషియా, ఒమన్

భారత్ vs పాకిస్తాన్ బిగ్ ఫైట్..?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభ రౌండ్లలో లేదా క్వార్టర్ ఫైనల్స్‌లో జరగడానికి ఎలాంటి అవకాశం లేదు. డ్రా ప్రకారం, రెండు జట్లూ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో విజయం సాధిస్తేనే.. సెమీఫైనల్ లేదా ఫైనల్ పోరులో ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంటుంది..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us