క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఎందుకు.? ఏ కారణంతో జరిగాయో అస్సలు ఊహించలేం. ఇక ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా అలాంటిదే. ఈ సంఘటన జరగడానికి ముమ్మాటికి అంపైర్‌దే తప్పు. క్లియర్ కట్ రనౌట్ అయితే.. అంపైర్ దాన్ని చాలా సింపుల్‌గా.. కూల్‌గా నాటౌట్ అని ప్రకటించేశాడు. ఆ వీడియో ఎవ్వరు చూసినా దాన్ని కచ్చితంగా అవుట్ అని అంటారు. మరి అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగింది. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ఏ మ్యాచ్‌లోనైనా.. అది క్యాచ్ అయినా, లేకపోతే ఎల్బీడబ్ల్యూ అయినా, స్టంపింగ్ అయినా.. కచ్చితంగా అంపైర్‌కి అపీల్ చేయాలి. అప్పుడే అంపైర్ దాన్ని ఔట్ లేదా నాటౌట్ కింద ప్రకటిస్తాడు. ఇక ఈ సింపుల్ లాజిక్‌ను మిస్ అయింది ఆస్ట్రేలియా టీం. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరిగింది. ఇందులో విండీస్ బ్యాటింగ్ సమయంలో.. 19వ ఓవర్ మూడో బంతికి వెస్టిండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్ రెండో రన్ తీస్తుండగా.. రనౌట్ చేశారు ఆస్ట్రేలియన్స్.
ఆస్ట్రేలియా జట్టు రనౌట్ చేశారు గానీ.. అంపైర్‌ను అవుటా.? నాటౌటా.? అని అపీల్ అడగలేదు. దీంతో అంపైర్ కూల్‌గా వికెట్లను సర్డుకున్నాడే తప్పితే.. థర్డ్ అంపైర్‌కి అపీల్ చేయలేదు. ఇక కాసేపటి తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఎందుకు అవుట్ ఇవ్వలేదని అంపైర్‌ని అడిగితే.. మీరు అపీల్ ఇవ్వలేదుగా అని చావుకబురు చల్లగా చెప్పాడు. దీంతో ఆసీస్ క్రికెటర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఇంకేముంది చేసేదేమీలేక వెళ్లి మిగిలిన మూడు బంతులు ఫీల్డింగ్ చేశారు. అయితే చివరికి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది కాబట్టి.. ఈ సంఘటనను లైట్ తీసుకుంది.. లేదంటే..! రచ్చ అయ్యేది అని నెటిజన్లు అంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
No appeal 🙅pic.twitter.com/sCZYzWDgnE
— CricTracker (@Cricketracker) February 12, 2024