రోహిత్ శర్మతో విభేదాలతోనే అగార్కర్ గుడ్ బై.. రేసులో ఎవ్వరూ ఊహించని పేరు..?
Ajit Agarkar vs Rohit Sharma: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తన బాధ్యతల విరమణకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తు ప్రణాళికలపై తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ (West Indies) సిరీస్ ఎంపిక భేటీయే ఆయనకు చివరిది కావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Ajit Agarkar vs Rohit Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పరిధిలో ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగిసిపోనుంది. అయితే రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు సంబంధించిన వ్యవహారమే అగార్కర్ ను ఇంటికి సాగనంపుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) వేదికగా రోహిత్‌ను పక్కనపెట్టి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కు ప్రాధాన్యమివ్వాలని అగార్కర్ భావించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ (England) వన్డే సిరీస్ లోని లార్డ్స్ మ్యాచ్ రోహిత్‌కు చివరి మ్యాచ్ అంటూ ప్రచారం మొదలైంది. బోర్డు పెద్దలు మాత్రం సీనియర్ బ్యాటర్‌కు పూర్తి మద్దతు పలకడంతో సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకమయ్యాయి.
లార్డ్స్ మైదానంలో సెంచరీతో సమాధానమిచ్చిన రోహిత్ శర్మ, వీడ్కోలు ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. బోర్డు సంయుక్త కార్యదర్శి దేవాజిత్ సైకియా (Devajit Saikia) రంగంలోకి దిగి రోహిత్ సేవలను ప్రశంసిస్తూ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశారు. ఈ కారణంతోనే సెలెక్టర్, బీసీసీఐ పెద్దల మధ్య సమన్వయం దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. బోర్డు ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో అగార్కర్‌కు కాంట్రాక్ట్ పొడిగింపు దక్కకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. వెస్టిండీస్ జట్టు ఎంపిక సమావేశమే ఆయన సారథ్యంలోని కమిటీకి ఆఖరి పనిగా భావిస్తున్నారు.
ఎక్కువమంది చదివినది: ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
అగార్కర్ వైదొలిగితే తదుపరి సెలెక్టర్‌గా భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత ఏడాది సెలెక్షన్ కమిటీలో చేరిన ఓజా, దేశవాళీ క్రికెట్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తూ జట్టుతో చురుగ్గా గడుపుతున్నాడు. బోర్డు పెద్దల నమ్మకాన్ని చూరగొన్న ఈ మాజీ క్రికెటర్‌కే తదుపరి పగ్గాలు దక్కవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
