అనిరుధ్‌తో కావ్య మారన్‌ పెళ్లి..? ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌, సన్‌రైజర్స్‌ ఓనర్‌ కావ్య మారన్‌ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌, చెన్నైలో రిసెప్షన్‌ నిర్వహించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ, ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అనిరుధ్‌తో కావ్య మారన్‌ పెళ్లి..? ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?
Anirudh Ravichander, Kavya

Updated on: May 23, 2026 | 10:06 AM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య మారన్‌ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ప్రస్తుతం సినీ, క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమానిగా కావ్య మారన్‌కు ఉన్న గుర్తింపు కారణంగా ఈ పుకార్లు మరింత వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం ఇరు కుటుంబాలు ఇప్పటికే వివాహానికి అంగీకరించాయని, స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించి, అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2026 ఎండింగ్‌లో ఈ వివాహం జరిగే అవకాశముందని కొన్ని ఫ్యాన్ పేజీలు, వినోద వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో ఇవి కేవలం సోషల్ మీడియా ఊహాగానాలేనని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనిరుధ్‌, కావ్య మారన్ మధ్య సంబంధంపై పుకార్లు వచ్చాయి. 2025లో సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు అనిరుధ్ స్వయంగా స్పందిస్తూ “పెళ్లా? హహా… దయచేసి పుకార్లు ఆపండి” అంటూ సరదాగా ఖండించారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో కూడా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నను ఆయన చమత్కారంగా తప్పించుకున్నారు. అయితే 1990లో జన్మించిన అనిరుధ్ ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉండగా, 1992లో జన్మించిన కావ్య మారన్ వయసు 33 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య సుమారు రెండేళ్ల వయసు తేడా ఉంది. ఇక వృత్తిపరంగా చూస్తే అనిరుధ్ ప్రస్తుతం భారతీయ సినీ సంగీత రంగంలో అత్యంత బిజీ కంపోజర్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన చేతిలో పలువురు స్టార్ హీరోల భారీ చిత్రాలు ఉండగా, అభిమానులు మాత్రం ఈ వివాహ పుకార్లపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us