వేరికోస్ వెయిన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక సాధారణ సమస్య. వేరికోస్ వెయిన్స్ కొరకు ఉపయోగించే సాంప్రదాయ చికిత్సా పద్ధతులు కోతతోకూడి, నొప్పిని కలిగి వుండే సందర్భంలో, వైద్య సాంకేతికతలో ఇటీవలే సంభవించిన పురోగతి కారణంగా రోగులకి తక్కువ నొప్పితోనే.. వేగవంతమైన కోలుకొనే సమయాన్ని ప్రసాదించే తక్కువ కోతతో కూడిన రెండు చికిత్స ప్రక్రియల అభివృద్ధి జరిగింది. అవే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ (ఇ.వి.ఎల్.ఏ), మెడికల్ గ్లూ థెరపీ.
ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్(ఇ.వి.ఎల్.ఏ) అనేది తక్కువ కోతతో కూడిన ఒక ప్రక్రియ. ఇది ప్రభావిత నరాన్ని మూసివేయడానికి లేజర్ శక్తిని ఉపయోగిస్తుంది. ఈ ప్రక్రియ కేంద్రీకృత మత్తు మందు ద్వారా పనిచేస్తుంది. అంతే కాకుండా, దీనికి కేవలం గంట కంటే తక్కువ సమయం పడుతుంది. చర్మంలో ఒక చిన్న కోత ద్వారా ప్రభావిత నరంలోనికి ఒక లేజర్ ఫైబర్‌ని ప్రవేశపెట్టడం ద్వారా ఇ.వి.ఎల్.ఏ చికిత్స చేస్తారు. లేజర్ శక్తి ఆ నరాన్ని వేడిచేసి, అది పడిపోయి, మూసుకొనిపోయేలా చేస్తుంది.
ఇక మెడికల్ గ్లూ థెరపీ అనేది వేరికోస్ వెయిన్స్ కొరకు ఉపయోగించబడుతున్న ఒక కొత్త చికిత్సా మార్గం. ఇందులో ప్రభావిత నరంలోనికి ఒక వైద్య పరమైన జిగురుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ జిగురు గట్టిపడుతుంది. ఆ విధంగా ఆ నరాన్ని సమర్థవంతంగా మూసివేసి రక్త ప్రవాహాన్ని ఇతర ఆరోగ్యవంతమైన నరాల్లోనికి మళ్ళిస్తుంది. కేంద్రీకృత మత్తు మందుని ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. దీనికి 30 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.
ఈ ప్రక్రియకి సంబంధించిన ఖర్చుల గురించి ఆందోళన చెందే వారికి చెప్పేదేంటంటే, ఇ.వి.ఎల్.ఏ, మెడికల్ గ్లూ థెరపీ రెండింటి ఖర్చు సగటుగా రూ. 40 వేల నుంచి రూ. 80 వేల వరకూ వుంటూ దగ్గర దగ్గరగా ఒకే విధమైన ఖర్చుని కలిగి వుంటాయి. కానీ, రోగి పరిస్థితి తీవ్రత, ఉపయోగించబడే చికిత్సా రకం, ఈ ప్రక్రియని నిర్వహించే వైద్యుడి అనుభవం ఆధారంగా ప్రతీ ఆపరేషన్ ఖర్చు మారవచ్చు.
కోలుకొనే సమయం విషయానికొస్తే.. ఇ.వి.ఎల్.ఏ కన్నా కూడా మెడికల్ గ్లూ థెరపీలో కోలుకొనే సమయం తక్కువగా వుంటుంది. ఆ విధంగా రోగులు ఆపరేషన్ పూర్తైన 24 గంటలలోనే తమ పనులని తిరిగి చేసుకోగలుగుతారు. కానీ ఇ.వి.ఎల్.ఏ రోగులకి కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.
సమర్థత విషయానికొస్తే, ఇ.వి.ఎల్.ఏ, మెడికల్ గ్లూ థెరపీ రెండూ కూడా వేరికోస్ వెయిన్స్ చికిత్సలో ఆశావహ ఫలితాలని చూపించాయి. ఏదేమైనప్పటికీ, మెడికల్ గ్లూ థెరపీ అనేది కొత్తగా వచ్చిన చికిత్సా మార్గం. కావున.. ఇ.వి.ఎల్.ఏ తో పోల్చడానికి వీలుగా దీర్ఘాకాలిక డేటా పరిమితంగా మాత్రమే అందుబాటులో వుంది.
ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ (ఇ.వి.ఎల్.ఏ), మెడికల్ గ్లూ థెరపీ రెండూ కూడా వేరికోస్ వెయిన్స్‌కి సంబంధించిన తక్కువ కోతతో కూడిన చికిత్సా ప్రక్రియలు, కానీ అవి ప్రతీ ఒక్కరికీ యోగ్యమైనవి మాత్రం కాదు. ఒకరోగిని ఈ చికిత్సలకి యోగ్యం కాని విధంగా మార్చే కొన్ని అంశాలు వున్నాయి. అందులో ఈ క్రింది వాటిని చూడొచ్చు.
1. గర్భధారణ: సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఇ.వి.ఎల్.ఏ కి లేదా మెడికల్ గ్లూ థెరపీకి గాని తగిన వారు కాదు. గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు మరియు రక్త ప్రవాహం పెరగడం వలన వేరికోస్ వెయిన్స్ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాధారణంగా చికిత్స చేయించుకోవడానికి గర్భదారణ పూర్తయ్యే వరకూ ఆగమని సూచించడం జరుగుతుంది.
2. క్రియాశీల ఇన్‌ఫెక్షన్: ప్రభావిత నారాల దగ్గర యాక్టివ్‌గా వున్న ఇన్‌ఫెక్షన్‌ని గానీ లేదా చర్మపు గాయాన్ని గానీ కలిగి వున్న రోగులు ఆ యొక్క ఇన్‌ఫెక్షన్ తగ్గే వరకు ఇ.వి.ఎల్.ఏ గానీ లేదా మెడికల్ గ్లూ థెరపీ గానీ చేయించుకోకూడదు.
3. సరిగ్గాలేనిరక్తప్రవాహం: కాళ్ళకి సరిగ్గా జరగని రక్త ప్రసరణ సమస్యని లేదా రక్తం ఎక్కువగా గడ్డలు కట్టే సమస్యలని కలిగి వున్న రోగులు ఇ.వి.ఎల్.ఏ లేదా మెడికల్ గ్లూ థెరపీ లాంటి చికిత్సలు చేయించుకోకూడదు.ః
4. ఇంతకు ముందు శస్త్ర చికిత్సలు జరిగివుండటం: ఇంతకు ముందే వెరికోస్ వెయిన్స్ స్ట్రిప్పింగ్ లాంటి శస్త్ర చికిత్సా ప్రక్రియలు జరిగిన రోగులు ఇ.వి.ఎల్.ఏ లేదా మెడికల్ గ్లూ థెరపీకి తగిన వారు కాకపోవచ్చు.
5. తీవ్రంగా దెబ్బతిన్న నరాలు: ఇ.వి.ఎల్.ఏ లేదా మెడికల్ గ్లూ థెరపీకి కూడా లొంగని తీవ్రమైన నరాల సమస్యలని కలిగి వున్న రోగులకి సంప్రాదాయక శస్త్ర చికిత్సా విధానాన్నే అనుసరించాల్సిన అవసరం ఉండవచ్చు.
ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్(ఇ.వి.ఎల్.ఏ) లేదా మెడికల్ గ్లూ థెరపీకి మీరు తగిన వ్యక్తి అవునో కాదో నిర్థారించడానికి మీరు ఒక వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మీ కొరకు ఉత్తమమైన చికిత్సా విధానాన్ని నిర్థారించడానికి మీ యొక్క వైద్య నిపుణుడు మీ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని, మీ వైద్య చరిత్రని మరియు మీ యొక్క వేరికోస్ వెయిన్స్‌కి తీవ్రతని పరిగణలోకి తీసుకుంటాడు.
అవిష్ వాస్క్యూలర్ సెంటర్ ఈ వేరికోస్ వెయిన్స్‌కి సమర్థవంతమైన చికిత్స అందిస్తోంది. అవిష్ వాస్క్యూలర్ సెంటర్లు మన తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగారలైన బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరు, కోల్‌కతా, మధురై, మంగళూరులోనూ ఈ సెంటర్లు ఉన్నాయి.
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451
Pune : 9701688544
Indore: 9701688544