దశమి, విజయదశమి, మహా నవరాత్రులు, నవరాత్రులు ఇలా దసరా పండుగకు ఎన్నో పేర్లు ఉన్నాయి. దశమికి రెండు రకాల పురాణ కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. భారత దేశానికి దక్షాణాది ప్రాంతాల్లో.. రావణుడిని.. రాముడి సంహరించినందుకు దశమి అనగా.. విజయదశమిని చేసుకుంటూంటారు. అలాగే.. ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసులకు రాజు అయిన మహిషాశురుడిని.. దుర్గామాత సంహరించినందుకు గానూ… ఈ పండుగను జరుపుకుంటారు. అయితే.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.. దశమికి ముందు 9 రోజులను దుర్గామాతను.. 9 రకాల ఆహార్యాల్లో పూజించి తరిస్తారు. ఈ సందర్భంగా.. ఆలయాలన్నీ.. పండుగ శోభను సంతరించుకుంటాయి.
దుర్గామాతకి ఎంతో ప్రీతికరమైన రోజులు శరన్నవరాత్రి. ఈ రోజుల్లో వీధుల్లో.. వాడవాడలా.. అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే.. తొమ్మిదిరోజుల అనంతరం.. విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో.. అమ్మవారు.. తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. కాగా.. అన్ని నవరాత్రుల్లో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి అని కూడా అంటారు. ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా దీన్ని పిలుస్తారు. శీతాకాలం మొదట్లో అంటే.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అవుతుంది కనుక.. ‘శరద్ నవరాత్రులు’ కూడా అని అంటారు.
ముఖ్యంగా మహిళలు.. ఈ శరన్నవరాత్రుల్లో.. ఆలయాల్లో లేదా.. ఇళ్లల్లో దుర్గామాతను ప్రతిష్టించి కుంకుమ పూజలు చేస్తారు. అలాగే.. వారి సౌభాగ్యం కోసం.. పసుపు, కుంకుమలను దానం ఇస్తారు. ఈ తొమ్మిది రోజులూ.. ఆలయాలన్నీ దేదీప్యమానంగా.. భక్తులతో కళకళలాడుతూంటాయి. ఇక బెజవాడ దుర్గామాత ఆలయంలో.. ఇసుక వేస్తే రాలనంత జనం.. అమ్మవారిని దర్శించుకుంటారు. ఎంతో.. నిష్టగా తొమ్మిది రోజులు.. తొమ్మది అమ్మవార్లకు పూజలు చేసి.. 10వ రోజు అంటే దశమి రోజు.. అమ్మవారికి యాట పోతులను ఇస్తారు. బంధువులందరినీ.. తమ ఇంటికి ఆహ్వానించి.. ఎంతో ఆనందంగా పండుగను చేస్తారు.
నవరాత్రుల్లో అమ్మవారి ఆహార్యం, నైవేథ్యం:
మొదటి రోజు: శ్రీ బాల త్రిపుర సుందరీ, పొంగల్
రెండవ రోజు: గాయత్రీ దేవి, పులిహోర
మూడవ రోజు: అన్నపూర్ణా దేవి, కొబ్బెరి అన్నం
నాల్గవ రోజు: కాత్యాయనీ దేవి, అల్లం గారెలు
ఐదవ రోజు: లలితా దేవి, దద్ధోజనం (పెరుగన్నం)
ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి
ఏడవ రోజు: మహా సరస్వతి దేవి, కదంబం
ఎనిమిదవ రోజు: మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం
తొమ్మిదవ రోజు: రాజరాజేశ్వర దేవి, పరమాన్నం