TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన టికెట్లు.. ఎప్పటి నుంచంటే..

|

Jan 06, 2023 | 7:27 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన టికెట్లకు సంబంధించి అధికారికంగా ప్రకటన రిలీజ్‌ చేసింది. ప్రత్యేక కోటా కింద ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శనం..

TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన టికెట్లు.. ఎప్పటి నుంచంటే..
Srivari Temple
Follow us on

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన టికెట్లకు సంబంధించి అధికారికంగా ప్రకటన రిలీజ్‌ చేసింది. ప్రత్యేక కోటా కింద ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శనం టికెట్లను జనవరి 7వ తేదీన (శనివారం) విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.

సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగులు దర్శన టికెట్లు తీసుకోవాలనుకునే వారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ బుక్‌ చేసుకునే వారి వయసు 65 ఏళ్లు నిండి ఉండాలి. ఆధార్‌ కార్డును ఐడీ ప్రూఫ్‌గా పరిగణలోకి తీసుకుంటారు. సీనియర్‌ సిటిజన్‌ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే) ఉంటుంది. అలాగే అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఇస్తారు. ఇక 80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..