AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే ఆర్జిత సేవా టికెట్ల జూన్‌ కోటా విడుదల.. ఇలా బుక్ చేస్కోండి..

తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మంగళవారం (మార్చి 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే ఆర్జిత సేవా టికెట్ల జూన్‌ కోటా విడుదల.. ఇలా బుక్ చేస్కోండి..
Tirumala Darshan Tickets
Raju M P R
| Edited By: |

Updated on: Mar 18, 2025 | 7:11 AM

Share

తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మంగళవారం (మార్చి 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లను పొందిన భక్తులు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

మార్చి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

ఇక శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లను విడుదల చేయనుంది.

జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

ఇక మార్చి 21న వర్చువల్ సేవల కోటాను టిటిడి విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

మార్చి 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది. జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఆన్ లైన్‌లో శ్రీవాణి టికెట్ల కోటా..

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఒక వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాపైనా క్లారిటీ ఇచ్చింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జూన్ నెల‌కు సంబంధించిన ఏస్ఏస్డి టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిలో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టిటిడి. టిటిడి అఫీషియల్ వెబ్ సైట్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తోంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లను పొందాలని కోరుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..