Mridanga Saileshwari Templ: భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం.. అనేక వింతలు, విశేషాలకు నెలవు. ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఉన్నాయి. సైన్స్ కు సవాల్ విసురుతూ అనేక రహస్యాలను దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం మృదంగ శైలేశ్వరి ఆలయం. ఇది కేరళలోని కన్నూర్ జిల్లాలో ముజక్కునులో ఉంది. ఈ ఆలయం పరశురాముడు నిర్మించిన 108 దుర్గా దేవాలయాల్లో ఒకటిగా నమ్మకం. అంతేకాదు సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ మృదంగ శైలేశ్వరి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం.
ఇక్కడ కొలువైన అమ్మవారు శైలేశ్వరి దేవిగా పూజలను అందుకుంటున్నారు. తనను భక్తిశ్రద్ధలతో పూజించే తన భక్తులకు సమాధానం ఇస్తుందని ప్రసిద్ధి. ఈ అమ్మవారి విగ్రహం పంచ లోహాలతో తయారు చేయబడింది. దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహం ఎంతో విలువైనదని కొంతమంది దొంగలు అమ్మవారి విగ్రహంపై కన్నేశారు. అంతేకాదు ఇప్పటి వరకు ఈ విగ్రహాన్ని దొంగిలించడానికి దొంగలు మూడుసార్లు ప్రయత్నాలు చేశారు. అయితే మూడు సార్లు వారు విఫలమయ్యారు. ఎందుకంటే దొంగలు స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి తిరిగి ఇచ్చారు. ఈ విషయంలో స్వయంగా రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి అలెగ్జాండర్ తన అనుభవాలను వివరించడంతో ఆలయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ పంచలోహ విగ్రహం మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్థులను ఆయన పనిచేస్తున్న సమయంలో సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట.
రెండు ప్రయత్నాలలో దొంగలు అమ్మవారి విగ్రహాన్ని కొన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారని.. మూడో ప్రయత్నంలో కొన్ని వందల మీటర్ల తీసుకుని వెళ్లి.. అక్కడ విగ్రహాన్ని వదిలి పారిపోయారని అధికారి తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రాగానే.. మళ్ళీ ఆలయం భక్తుల రద్దినెలకొంది. భారీగా అమ్మరిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలు కట్టారు.
మొదటి సారి అమ్మవారి విగ్రహాన్ని దొంగలించిన దొంగలు తమకు తల తిరుగుతున్నదని, మూత్ర విసర్జన, మల విసర్జన చేయవలసిన అవసరాన్ని నియంత్రించుకోలేక విగ్రహం వెనుక వదిలి వెళ్ళవలసి వచ్చిందని ఒప్పుకున్నారు. రెండవ ప్రయత్నంలో విగ్రహం మృదంగ శైలేశ్వరి ఆలయానికి చెందినదని.. దీనిని తిరిగి ఆలయంలో అప్పగించమని ఓ లెటర్ రాసి రోడ్డు పక్కన విడిచి పెట్టారు. మూడో ప్రయత్నంలో ఎక్కువ దూరం వెళ్లలేక విగ్రహాన్ని లాడ్జిలో వదిలేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక్కడే ఉద్భవించిన కేరళ శాస్త్రీయ నృత్యం కథాకళి
ఈ ఆలయం జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. అమ్మవారు దుర్గా రూపంలో ఉంటుంది. దుర్గను “మిఝావిల్ భగవతి” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి “మృదంగ శైలేశ్వరి” అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయిందని కథనం. శక్తి ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి.. అనంతరం అమ్మవారి కోసం ఆలయాన్నినిర్మించాడని స్థల పురాణం.
ఇక్కడ అమ్మవారి విగ్రహం మృదంగం, తాళ వాయిద్యం రూపంలో కనిపించిందని, అందుకే దేవతకు సంగీతంతో సంబంధం ఉందని చెబుతారు.ప్రధాన విగ్రహం కాకుండా, ఆలయానికి దక్షిణం వైపున మరొక విగ్రహం ఉంది, ఇక్కడ దేవత మిళావు రూపంలో కనిపించింది. ఇది ఇప్పుడు ప్రధాన ఆలయంలో ఉంది.
కథాకళి పితామహుడిగా పరిగణించబడే కొట్టాయం తంపురాన్‌కు ఎదురుగా ఉన్న ఆలయ చెరువు వద్ద దేవత ప్రత్యేక వేషధారణలో కనిపించిన తర్వాత కథాకళిలోని స్త్రీ రూపాల మూలం ఈ ఆలయం నుండి ఉద్భవించిందని చెబుతారు.
ఇక్కడ ఆలయంలో దేవిని సిపాయిల తిరుగుబాటు జరగడానికి చాలా ముందు బ్రిటీష్ వారిపై పోరాడిన పురాణ రాజు పజాస్సి రాజా ఈ దేవతను ఆరాధించారని తెలుస్తోంది. రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు దేవతకు బలి అర్పించడం వల్ల పొర్కలి అనే పేరు ఉనికిలోకి వచ్చింది. ఈ ఆలయంలో మరో ఆసక్తికరమైన దృశ్యం.. ఇక్కడ ఉన్న రావి చెట్టు.. పచ్చగా కాకుండా తెల్లని రంగులో ఉంటుంది. (Source)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..