Shata Chandi Homa: శక్తి స్వరూపిణీ అనుగ్రహం కోసం శత చండీ యాగం.. ఈ నెల 4 నుంచి క్రతువు నిర్వహించనున్న పండితులు

| Edited By: TV9 Telugu

Nov 03, 2023 | 4:45 PM

ఆధ్యాత్మిక నేల జగిత్యాలలో గురువుల ఆదేశానుసారం ప్రముఖ వేద, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వనాథం శర్మ (విశ్శు) ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి అత్యంత నియమ, నిష్టలతో శతచండీ యాగం జరగనుంది. జిల్లా కేంద్రమైన జగిత్యాలలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వందలాది మంది వేదపండితులు, వేలాది మంది భక్తజనుల సాక్షిగా ఈ యాగ నిర్వహణ క్రతువు జరగనుంది.

Shata Chandi Homa: శక్తి స్వరూపిణీ అనుగ్రహం కోసం శత చండీ యాగం.. ఈ నెల 4 నుంచి క్రతువు నిర్వహించనున్న పండితులు
Shata Chandi Homa
Follow us on

హిందూ సనాతన ధర్మంలో యజ్ఞయాగాదులకు ప్రముఖ స్థానం ఉంది. ప్రకృతి, ప్రజల సంక్షేమం కోసం మునులు, రాజులు అనేక రకాల యాగాలను నిర్వహించేవారు. అటువంటి యాగాల్లో ఒకటి చండీయాగం. ఈ యాగం వలన ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతతతోపాటు మనో కామన చేకూరుతుంది. రాజుల కాలంలో శతృవులపై విజయం సాధించి, రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో తులతూగాలని కాంక్షించి చేసేవారు. ఇప్పటి కాలంలో పాలకులైన ముఖ్యమంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు భక్తి శ్రద్దలతో చండీయాగం చేస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు.

జగాలను ఏలే ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంశ జగజ్జనని శక్తి స్వరూపిణీ. సకల జగత్తుపై కరుణా కటాక్షా వీక్షణలు సర్వ జనులపై కురువాలన్న సత్‌ సంకల్పంతో ఒకప్పటి ఉద్యమాల గడ్డ, నేటి ఆధ్యాత్మిక నేల జగిత్యాలలో గురువుల ఆదేశానుసారం ప్రముఖ వేద, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వనాథం శర్మ (విశ్శు) ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి అత్యంత నియమ, నిష్టలతో శత చండీ యాగం జరగనుంది.

జిల్లా కేంద్రమైన జగిత్యాలలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వందలాది మంది వేదపండితులు, వేలాది మంది భక్తజనుల సాక్షిగా ఈ యాగ నిర్వహణ క్రతువు జరగనుంది. కలియుగంలో సత్వర వరాలు ప్రసాదించే జగన్మాత దయ కోసం నాలుగు రోజులపాటు వైభవంగా శాస్త్రోక్తంగా శతచండీ యాగాన్ని నిర్వహించేందుకు అంగ రంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి మహిళల కోలాటాలు, వేద మంత్రోఛ్చరణల మధ్య భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుంచి జగన్మాత విగ్రహ శోభాయాత్రతో శతచండీ యాగ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

ఆ రోజు సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా స్వీకారం, యాగశాల ప్రవేశం, అమ్మవారికి విశేషపూజలు నిర్వహిస్తారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు శతచండీ పారాయణం, హోమ క్రియలు నిర్వహించనున్నారు. అలాగే మహా గణపతికి లక్ష దుర్వార్చన,  లయ కారుడైన మహాదేవుడి కృప కోసం లక్ష బిల్వార్చన, అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమార్చన, వివిధ పుష్పాలతో పుష్పార్చనలు, నిత్యం నవగ్రహ, నక్షత్ర హోమాలు ఉంటాయి. ఈనెల 9న మహా పూర్ణాహుతితో జగిత్యాలలో శతచండీ హోమం పరిసమాప్తమం కానుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..