Jaggi Vasudev: ‘జీవితం అంటే బ్రతుకుపై అవగాహన కలిగి ఉండటమే’.. గురు సద్గురువు సందేశం..

వ్యాసపౌర్ణమి సందర్భంగా గురువుల గురించి సద్గురువు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు గురువు పాత్ర ఏమిటి? అనేదానికి ఒక అర్థాన్ని వివరించారు. ఒక గురువుగా తన పాత్ర ప్రజలకు సాంత్వన కలిగించడం కాదని అన్నారు. తాను ప్రజలలో ఉన్న అత్యున్నత శక్తిని మేల్కొల్పడానికి ఇక్కడ ఉన్నానన్నారు. ఆధ్యాత్మిక శాస్త్ర ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే.. మానవుడికి జీవిత పరమార్థాన్ని గుర్తు చేసి మేల్కొల్పడమే అన్నారు.

Jaggi Vasudev: 'జీవితం అంటే బ్రతుకుపై అవగాహన కలిగి ఉండటమే'.. గురు సద్గురువు సందేశం..
Sadhguru Jaggi Vasudev
Follow us

|

Updated on: Jul 21, 2024 | 4:58 PM

వ్యాసపౌర్ణమి సందర్భంగా గురువుల గురించి సద్గురువు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు గురువు పాత్ర ఏమిటి? అనేదానికి ఒక అర్థాన్ని వివరించారు. ఒక గురువుగా తన పాత్ర ప్రజలకు సాంత్వన కలిగించడం కాదని అన్నారు. తాను ప్రజలలో ఉన్న అత్యున్నత శక్తిని మేల్కొల్పడానికి ఇక్కడ ఉన్నానన్నారు. ఆధ్యాత్మిక శాస్త్ర ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే.. మానవుడికి జీవిత పరమార్థాన్ని గుర్తు చేసి మేల్కొల్పడమే అన్నారు. తద్వారా అతను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణమైన జ్ఙానాన్ని కలిగి ఉంటాడన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో బ్రతికేందుకు ఎంత ఎక్కువ కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటాడో అంత లోతుగా జీవిత సారాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. ఆధ్యాత్మికం అంటే జీవితాన్ని అనుభవించడమే తప్ప వదిలేయడం కాదన్నారు.

తనను తాను నచ్చిన పని చేస్తూ జీవితాన్ని అనుభవించాలని చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణంలో ప్రజలు మమేకం అవడం అంత సులభం కాదని, ఇలా బ్రతికేందుకు భయపడుతూ ఉంటారన్నారు. ఆ భయాన్ని తొలగించేందకు గురువు అవసరం అని వివరించారు. తాను నిరంతరం అనేక మంది భక్తులతో సత్సంబంధాలు కలిగి ఉంటానన్నారు. అదే క్రమంలో తన భక్తులు తనతో పాటూ ప్రకృతితో అనుసంధానం కావల్సి ఉంటుందన్నారు. నడుస్తున్న భూమితోపాటూ.. చూడగలిగే, స్పర్షించగలిగే, వాసన చూడగలిగే వాటిపై అధిక ప్రధాన్యమివ్విలని అన్నారు. అప్పుడే జీవితం అంటే భయాన్ని తొలగి చిక్కుల్లో పడతామనే భావన తొలిగిపోతుందన్నారు.

ప్రతి వ్యక్తికి భయం అనేది సహజమైన స్థితి కాదన్నారు. అవగాహన లేకపోవడం వల్ల కలిగే ఒక భావన అని వివరించారు. దానిపై ఒక నిర్ధిష్టమైన అవగాహన వస్తే భయం అసలు ఉండదని స్పష్టం చేశారు. జీవితం కూడా అలాగేనని, అవగాహన లేకపోవడం వల్ల భయం కలుగుతుందే తప్ప అపరిమితమైన అవగాహన పెంచుకుంటే యథార్థాన్ని అర్థం చేసుకోగలరని, తద్వారా భయాన్ని పారదోలచ్చన్నారు. ఈ శక్తిని పెంపొందించుకోవడం కోసం యోగా శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉదాహరణకు శివుడిని మనం ఆదియోగిగా చూస్తామని తెలిపారు. అంటే తొలిగురువు అని అర్థం. ఆయన తెలిపిన విధంగా జీవితాన్ని అందంగా సుందరంగా నిర్మించుకోవాలన్నారు. ఆయనే జీవిత పరమార్థాన్ని అందజేసేందుకు ఏకైన మార్గమని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'జీవితం అంటే బ్రతుకుపై అవగాహన కలిగి ఉండటమే'.. సద్గురువు సందేశం..
'జీవితం అంటే బ్రతుకుపై అవగాహన కలిగి ఉండటమే'.. సద్గురువు సందేశం..
నదిని ఈదిన పారిస్‌ మేయర్‌.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నదిని ఈదిన పారిస్‌ మేయర్‌.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
గొడవలు ఏం లేవ్‌.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
గొడవలు ఏం లేవ్‌.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
వావ్‌ !! RRR కలెక్షన్స్‌ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
వావ్‌ !! RRR కలెక్షన్స్‌ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
ఎన్ని ప్రయత్నాలు చేసినా మలబద్ధకం తగ్గడం లేదా.? ఇవి తింటే చాలు
ఎన్ని ప్రయత్నాలు చేసినా మలబద్ధకం తగ్గడం లేదా.? ఇవి తింటే చాలు
రఘుతాత కాంట్రవర్సీపై స్పందించిన కీర్తి సురేష్..
రఘుతాత కాంట్రవర్సీపై స్పందించిన కీర్తి సురేష్..
షాక్‌లపై షాక్‌లు.. హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్
షాక్‌లపై షాక్‌లు.. హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్
బంగారంపై సులభంగా రుణాలు.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే..
బంగారంపై సులభంగా రుణాలు.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే..