Nag Panchami 2024: కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి

|

Aug 01, 2024 | 1:25 PM

నాగ పంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం ఉంటే వారికీ నాగ పంచమి రోజు చాలా ముఖ్యమైనది. కాల సర్ప దోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతిదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు రాహు-కేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాగ పంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహు-కేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది.

Nag Panchami 2024: కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
Naga Pancahmi 2024
Follow us on

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగలు, వ్రతాలు, శుభకార్యాలతో సందడే సందడి. నాగ పంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నాగ పంచమి పండుగను భారతదేశంలోనే కాదు పొరుగు దేశం అయిన నేపాల్ తో పాటు హిందూ జనాభా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున నాగేంద్రుడిని పూజిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన నాగ పంచమి రోజున పాములను పుజిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి పండుగ శుక్రవారం, 9 ఆగస్టు 2024న వచ్చింది.

నాగ పంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం ఉంటే వారికీ నాగ పంచమి రోజు చాలా ముఖ్యమైనది. కాల సర్ప దోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతిదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు రాహు-కేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాగ పంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహు-కేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది.

కాల సర్ప దోషం అంటే ఏమిటి?

జ్యోతిష్యశాస్త్రంలో అన్ని గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. విశ్వాసాల ప్రకారం ఈ లోపం వల్ల ప్రజల జీవితాల్లో ఆర్ధిక ఇబ్బందులు, వివాహానికి ఆటంకం, సంతానం లేకపోవడం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. కాలసర్ప దోషాన్ని నివారణ కోసం నాగ పంచమి రోజున ఈ చర్యలు చేయండి.

ఇవి కూడా చదవండి

నాగ పంచమి రోజున చేయాల్సిన పరిహారాలు

  1. కాలసర్ప దోష నివారణకు నాగ పంచమి రోజున పాము ఆకారాన్ని తయారు చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి. దీని తరువాత నాగరాజుకి సంబంధించిన 12 పేర్లను జపించండి. అనంత, వాసుకి, పద్మనాభ, శేష, కంబల, కర్కోటక, ధృతరాష్ట్ర, అశ్వతర, కాళీయ, శంఖపాల, పింగళ, తక్షకులను తలచుకుని పూజ చేయండి.
  2. హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు. నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేసి పూజించడం వల్ల జాతకంలో కాల సర్ప దోషం కూడా తొలగిపోతుంది.
  3. లేదా వెండి పామును కొని దానిని నాగ పంచమి రోజున ప్రతిష్టించి పూజ చేయండి. ఆనంతరం ఆ వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. నాగ పంచమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల కాల సర్ప దోషం తొలగిపోతుంది.
  4. హిందూ మతంలో గాయత్రీ మంత్రాన్ని మహామంత్రం అంటారు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. కాల సర్ప దోషాన్ని తొలగించడానికి నాగ పంచమి రోజున నాగ దేవత, భోలాశంకరుదిని పూజించండి. తరువాత గాయత్రీ మంత్రాన్ని జపించండి.
  5. ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే నాగ పంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి. జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి పాలు, పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన కాల సర్ప దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది.
  6. నాగ పంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సంప్రదాయం ఉంది. అయితే పాము దేవుడిని పూజించే ముందు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివుని మెడలో ఆభరణంగా ఉన్న వాసుకిని పూజించాలి.
  7. నాగ పంచమి రోజున సముద్రపు ఉప్పు, ఆవు మూత్రంతో కలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి. దీని తరువాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల సర్ప దోషం నుంచి బయటపడటానికి నాగ పంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్లి శుభ్రం చేయండి. అలాగే ఆలయ మెట్లను 10 రోజుల పాటు శుభ్రం చేస్తే కాల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు