Lord Shiva: సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఎలా పూజ చేయాలి? ఏ రాశివారు ఏమి సమర్పించడం ఫలవంతం అంటే..
సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజు దేవతల దేవుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భోలేనాథ్‌ను పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. దీనితో పాటు ఇంట్లో ఆనందం నెలకొంటుందని నమ్మకం. మహాదేవుడిని మీరు సంతోషపెట్టాలనుకుంటే.. సోమవారం రోజున శివుడికి పూజ చేయడమే కాదు రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. ఈ రోజు ఏ రాశి ప్రకారం ఏ వస్తువులను సమర్పించాలంటే..
సోమవారం హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. శివ పూజకి చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున శివయ్యను పూజించడం వల్ల అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. దీనితో పాటు భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఆహారం, డబ్బు లకు ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు సోమవారం శివుడితో పాటు నవ గ్రహాల్లో ఒకటైన చంద్రుడిని కూడా పూజిస్తారు. మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వలన శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి. దీనితో పాటు సోమవారం ఉపవాసం ఉండటం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే సోమవారపు నియమాల ప్రకారం పూజ చేసి అనంతరం శివయ్య పూజలో రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించండి. చివరిగా ‘లింగాష్టకం స్తోత్రం’ పఠించండి.
శివుని పూజా విధానం- విధి
పూజ ప్రారంభించే ముందు శివుడిని ధ్యానించి, పూజ కోసం ఒక సంకల్పం చేయండి.