ఈ సంవత్సరంలో చివరి, రెండవ చంద్రగ్రహణం ఈరోజు అంటే 28 అక్టోబర్ 2023న సంభవించబోతోంది. శరత్ పూర్ణిమ రోజున సంభవించే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో కనిపిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో సూతక కాలం ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం అశుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు, పూజలను చేయరు. గ్రంథాల్లో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని పేర్కొన్నారు. ఈ రోజు మనం గ్రహణ సమయంలో ఏ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
చంద్రగ్రహణ సమయంలో దేవతల విగ్రహాలను లేదా దేవుని ఆలయాలను తాకడం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుందని విశ్వాసం. అయితే ఈ సమయంలో మీరు మీ మనస్సులో భగవంతుని స్మరించుకోవచ్చు. మీ మనస్సులో మంత్రాలను కూడా జపించవచ్చు.
హిందువుల నమ్మకం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అంతే కాకుండా బట్టలు కుట్టడం, బట్టలు నేయడం మొదలైన పనులు చేయడం కూడా నిషేధం
హిందూ మత గ్రంధాల్లో చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.
గ్రహణం సమయంలో వంటగదిలో వండిన ఆహారం మిగిలి ఉంటే, దానిని తినకూడదు. ఇలా వండిన ఆహారాన్ని పారేసే బదులు ఆవు, కుక్క లేదా మరేదైనా జంతువుకు తినిపిస్తే మంచిది.
గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. అందువల్ల.. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.