Plants at Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. నెగిటివిటీ మొత్తం తొలగిపోతుంది..

|

Aug 21, 2024 | 2:30 PM

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. పూలు, పండ్లు, కూరగాయలు, డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచకూడదు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు ఉండటం వల్ల ఇల్లు కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా వాటి నుంచి వచ్చే గాలిని ప్యూరిఫై..

Plants at Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. నెగిటివిటీ మొత్తం తొలగిపోతుంది..
Plants At Home
Follow us on

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. పూలు, పండ్లు, కూరగాయలు, డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచకూడదు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు ఉండటం వల్ల ఇల్లు కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా వాటి నుంచి వచ్చే గాలిని ప్యూరిఫై చేస్తాయి. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి. మొక్కల్ని చూడగానే ఒకలాంటి సంతోషం కలుగుతుంది. అయితే కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగిటివిటీ అనేది దూరమవుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్క:

తులసి మొక్క అనేది ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా కంట్రోల్‌ చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలని, పూజించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి.. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

పీస్ లిల్లీ:

పేరుకు తగ్గట్టుగానే ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి.. పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. అంతే కాదు గాలిని కూడా శుద్ధి చేస్తుంది. గాలిలో ఉండే టాక్సిక్స్‌ను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మనీ ప్లాంట్:

చాలా మంది ఇప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారు. ఈ మొక్క ఎదుగుదలకు ఎండ అనేది పెద్దగా అవసరం లేదు. ఎక్కడ ఉంచి కొద్దిగా నీరు పోసినా బ్రతికేస్తుంది. ఈ మొక్కను అదృష్టానికి కూడా చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలిని శుద్ధి చేస్తుంది.

కలబంద:

ఇంట్లో పెంచుకోవాల్సిన మక్కల్లో కలబంద కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. కలబంద కూడా గాలిని ప్యూరి ఫై చేస్తుంది.