AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: పాకిస్థాన్‌లో ముస్లిం కళాకారుడి చేతుల్లో గణపతి విగ్రహం.. వైరల్‌గా మారిన వీడియో!

Ganesh Chaturthi Celebrations in Pakistan: కరాచీలోని గణేశ్ మఠ్ మందిర్‌లో ఓ ముస్లిం కళాకారుడు మరాఠీ కుటుంబం కోసం గణపతి విగ్రహానికి రంగులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ganesh Chaturthi: పాకిస్థాన్‌లో ముస్లిం కళాకారుడి చేతుల్లో గణపతి విగ్రహం.. వైరల్‌గా మారిన వీడియో!
Ganesh Chaturthi In Pakistan
Rajashekher G
|

Updated on: Sep 12, 2026 | 2:49 PM

Share

Ganesh Chaturthi in Pakistan: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి వెలువడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరాచీలో నివసిస్తున్న ఓ మరాఠీ కుటుంబం కోసం ఓ ముస్లిం కళాకారుడు గణపతి విగ్రహానికి రంగులు వేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కరాచీలోని మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం నిర్వహిస్తున్న గణేశ్ మఠ్ మందిర్‌లో ఈ విగ్రహానికి రంగులు అద్దినట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగ ఏర్పాట్లు చేసుకుంటున్న దృశ్యాలను కూడా వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోను కరాచీలో నివసించే మరాఠాగా తనను తాను పరిచయం చేసుకున్న అమర్ ప్రకాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘కరాచీలో మహారాష్ట్ర కుటుంబం నిర్వహిస్తున్న గణేశ్ మఠ్ మందిర్‌లో గణపతి బప్పాకు ముస్లిం కళాకారుడు రంగులు వేస్తున్నారు’’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో ప్రారంభంలో ఆలయంలో తెల్లటి రంగులో ఉన్న గణపతి విగ్రహం కనిపిస్తుంది. కళాకారుడు తొలుత స్ప్రే పెయింట్‌తో విగ్రహానికి రంగులు వేయడం ప్రారంభిస్తారు. అనంతరం బ్రష్‌తో గణపతి విగ్రహానికి జాగ్రత్తగా రంగులు అద్దారు. వివిధ రంగులతో పాటు బంగారు, వెండి రంగులను ఉపయోగిస్తూ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.

వీడియోపై ‘‘కౌన్ హిందూ, కౌన్ ముస్లిం? ది పవర్ ఆఫ్ బప్పా అండ్ బ్యూటీ ఆఫ్ కరాచీ’’ అనే టెక్స్ట్‌ను ఉంచారు. అంటే.. ‘‘ఎవరు హిందువు? ఎవరు ముస్లిం? ఇదే బప్పా శక్తి.. ఇదే కరాచీ అందం’’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని ఇచ్చారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పలువురు హార్ట్ ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. మరికొందరు కళాకారుడి ప్రతిభను ప్రశంసించారు. ‘‘మానవత్వమే గొప్ప మతం’’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘‘ప్రతి మతం మంచిదే.. దాన్ని చెడుగా మార్చేది మనుషులే’’ అని మరో వ్యక్తి పేర్కొన్నారు.

మరికొందరు కరాచీలో కూడా గణేష్ చతుర్థి వేడుకలు జరుగుతున్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘పాకిస్థాన్‌లో కూడా గణపతి వేడుకలు జరుపుకుంటారా?’’ అని ఓ యూజర్ ప్రశ్నించారు. ‘‘ఆయన చాలా ప్రతిభావంతుడు’’ అని మరొకరు ప్రశంసించగా.. ‘‘విగ్రహం చాలా అందంగా ఉంది’’ అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. మతాలకు అతీతంగా కళ, భక్తి, మానవత్వం ఒక్కటేననే సందేశాన్ని ఈ వీడియో చాటుతోందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వీడియో చూడండి..

Follow Us