Chanakya Niti: ఈ ముగ్గురికి సహాయం చేస్తే బాధ తప్ప మరేం ఉండదు.. చాణక్య చెప్పిన షాకింగ్ విషయాలు..!

|

May 19, 2022 | 11:25 AM

Chanakya Niti: ఇతరులకు సహాయం చేయడం మంచి అలవాటు. చిన్నతనంలో, తల్లిదండ్రులు మనందరికీ అలాంటి విలువలను నేర్పిస్తారు.

Chanakya Niti: ఈ ముగ్గురికి సహాయం చేస్తే బాధ తప్ప మరేం ఉండదు.. చాణక్య చెప్పిన షాకింగ్ విషయాలు..!
Chanakya
Follow us on

Chanakya Niti: ఇతరులకు సహాయం చేయడం మంచి అలవాటు. చిన్నతనంలో, తల్లిదండ్రులు మనందరికీ అలాంటి విలువలను నేర్పిస్తారు. ఇతరులు బాధపడితే.. మనకు సాధ్యమైన వరకు సాయం చేయాలని చెప్తుంటారు. అయితే, ఆ సాయం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అవసరమైన వారికి మాత్రమే సాయం చేయాలంటున్నారు ఆచార్య చాణక్య. కౌంటిల్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, అపర మేధావిగా, ఆచార్యగా గుర్తింపు పొంది.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల ప్రజల జీవన విధానానికి నీతిశాస్త్రం అనే దిక్సూచిని అందించారు చాణక్యుడు. ఆ నీతిశాస్త్రంలోనే జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను పేర్కొన్నారు. అందులో ఒకటి ఎవరికి సాయం చేయాలి.. ఎవరికి సాయం చేయకూడదు.. అనే అంశం కూడా ఉంది. తప్పు చేసే వ్యక్తులకు సహాయం చేస్తే.. వారు మిమ్మల్ని తరచుగా ఉపయోగించుకోవాలని చూస్తారని ఆచార్య పేర్కొన్నారు. మీరు దీనిని గ్రహించకపోతే.. దుఃఖం, పాశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలవని చెబుతున్నారు. అందుకే ఎప్పుడైనా సరే.. అర్హులైన వారికి మాత్రమే సహాయం చేయాలని చెబుతున్నారాయన. ఆచార్య చాణక్య చెప్పిన ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చెడు స్వభావం గల స్త్రీ
చెడు స్వభావం గల స్త్రీని మీరు ఎన్ని కష్టాల్లో చూసినా వారికి సహాయం చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాంటి స్త్రీ తన దుష్టత్వాన్ని ఎప్పటికీ వదులుకోదు. ఆమె మిమ్మల్ని సహాయం పేరుతో మాత్రమే ఉపయోగించుకుంటుంది. మీరు ఆమెకు ఉపయోగపడేంత వరకు ఏ పరిస్థితిలోనైనా మీకు మద్దతు ఇస్తుంది. తేడా వస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతుంది. అలాగే.. సమాజంలో ఒక పేరు ప్రతిష్ఠలు ఉన్న వ్యక్తి ఇలాంటి చెడు లక్షణాలు ఉన్న మహిళకు సహాయం చేస్తే కష్టాలపాలవడంతో పాటు.. అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు.

2. కారణం లేకుండా సంతోషంగా ఉన్నవారు..
కొందరి జీవితంలో అంతా సవ్యంగానే సాగినా.. ఏడ్వడం అలవాటు. అలాంటి వారికి సహాయం చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎటువంటి కారణం లేకుండా నిత్యం బాధపడేవారు.. ఇతరుల ఆనందాన్ని నిజంగా సహించరు. వారు స్వయంగా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయరు. ఇతరుల విజయాలను చూసి అసూయపడతారు. అలాంటి వారికి సహాయం చేయడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

3. తెలివితక్కువ వ్యక్తి..
తెలివితక్కువ వ్యక్తికి మీరు ఎంత వివరించినా వారు ఎల్లప్పుడూ తమను తాము ఉన్నతంగా భావిస్తారు. మీరు అలాంటి వారికి సహాయం చేయాలని ఆలోచిస్తే, మీరు మీ సమయాన్ని వృధా చేసుకున్నట్లే. అలాంటి వ్యక్తికి మీరు మంచి మాటలు చెప్పినా.. వారు మాత్రం అందులోని చెడునే వెతికి పట్టుకుని వాదనకు తెరలేపుతారు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది.