దారుణంః క‌న్న‌తండ్రినే ఇంట్లోకి రానివ్వ‌ని కొడుకులు

క‌న్న‌తండ్రినే కుమారులు ఇంట్లోకి రానివ్వ‌ని ఘ‌ట‌న తెనాలిలో చోటు చేసుకుంది. దీంతో అత‌డు రోడ్లపై ఉండాల్సి వచ్చింది.

దారుణంః క‌న్న‌తండ్రినే ఇంట్లోకి రానివ్వ‌ని కొడుకులు
Follow us

|

Updated on: May 14, 2020 | 12:00 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. క‌న్న‌తండ్రినే కుమారులు ఇంట్లోకి రానివ్వ‌ని ఘ‌ట‌న గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తూర్పుగోదావరి జిల్లాలోని తన తమ్ముడి ఇంటికి మార్చిలో వెళ్లి లాక్‌డౌన్ కార‌ణంగా అక్క‌డే చిక్కుకుపోయాడు. ఈనెల 10న ఆయన తెనాలి తిరిగొచ్చాడు.. ఇంటికి వ‌చ్చిన పెద్దాయ‌న‌కు కొడుకులు షాక్ ఇచ్చారు. ..వైరస్ భయంతో అత‌న్ని ఇంట్లోకి రానివ్వ‌లేదు. దీంతో అత‌డు రోడ్లపై ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కుమారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆ వృద్ధుడిని ఇంట్లోకి పంపారు. ఇదిలా ఉంటే, తెనాలికి చెందిన మ‌రో యువ‌కుడు చెన్నై అధికారుల క‌ళ్లుగ‌ప్పి స్వ‌స్థ‌లానికి వ‌చ్చాడు. విష‌యం తెలుసుకున్న అధికారులు అత‌డి క‌రోనా టెస్ట్ చేయ‌గా పాజిటివ్‌గా తేలింది.
తెనాలికి చెందిన యువకుడు చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.. హాస్టల్‌లో ఉంటున్నాడు.. లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయాడు. ఎలాగైన సొంతూరికి రావాల‌నే కోరిక‌తో..ఈ నెల ఒక‌ట‌వ తేదీన‌ చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు తెనాలి నుంచి కూరగాయల లారీ ఎక్కి చెన్నై నుంచి ఈ నెల 4న యువకుడు తెనాలిలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం వాలంటీర్లు, వైద్య సిబ్బందికి  తెలియడంతో.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు…పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన కరోనా బాధితుడు, అతని తండ్రి, లారీ ఓనర్‌, డ్రైవర్‌పై తెనాలి టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.