వీరిద్దరూ కలవడానికి మన్మథుడి పాత్ర పోషించింది ఎవరో తెలుసా?

హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో వీళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. తపన అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అర్చన. పెద్దగా కలిసిరాకపోవడంతో జాతకరీత్యా తన పేరును వేద నుంచి అర్చనగా మార్చుకుంది. ఖలేజా, బలుపు, లయన్, పరమ వీర […]

వీరిద్దరూ కలవడానికి మన్మథుడి పాత్ర పోషించింది ఎవరో తెలుసా?
Follow us

|

Updated on: Oct 05, 2019 | 10:29 AM

హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో వీళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. తపన అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అర్చన. పెద్దగా కలిసిరాకపోవడంతో జాతకరీత్యా తన పేరును వేద నుంచి అర్చనగా మార్చుకుంది. ఖలేజా, బలుపు, లయన్, పరమ వీర చక్ర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో వేదకు మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా సప్తగిరి హీరోగా వచ్చిన వజ్రకవచధర సినిమాలో నటించింది వేద. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్ గా మంచి పాత్ర పోషించింది. కాకపోతే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా గుర్తింపురాలేదు. కాగా అర్చన నిశ్చితార్థానికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్చనతో బిగ్ బాస్ లో పాల్గొన్న బ్యాచ్ అంతా వచ్చింది. నవదీప్, శివబాలాజీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హీరో సుమంత్ కూడా హాజరయ్యాడు. అర్చన పెళ్లి నవంబర్ 14న జరగనుంది.

కాగా అర్చన పెళ్లి కోసం మన్మథుడి పాత్ర పోషించింది వ్యక్తి ఎవరో తెలిసా?. యాక్టర్ శివ బాలాజి. అవును ఈ విషయాన్ని స్వయంగా అర్చనే తెలిపింది. జగదీష్, శివబాలాజీకి చిన్ననాటి స్నేహితుడట. అలా జగదీశ్‌కి, అర్చనకి శివబాలాజీ ద్వారానే పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత పలు సందర్భాల్లో అర్చన, జగదీశ్‌ను ఇంటికి తీసుకెళ్లగా..ఆమె పేరెంట్స్ మరియు ప్రెండ్స్‌కు బాగా నచ్చాడని తెల్పింది. వారి ప్రేమను ఒకరికొకరు వ్కక్తపరుచుకోడానికి ముందుగా అందరూ తాము మంచి జోడి అందరూ అనుకోవడం ప్రారంభించాడని తెల్పింది. తాను హైపర్ యాక్టీవ్ అన్న అర్చన..జగదీశ్ కామ్ గోయింగ్ పర్సన్ అని..ఇద్దరికి బ్యాలెన్స్ అవుతుందని పేర్కుంది.

 Siva Balaji played Cupid for Juggy and me: Archana