రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి : మమత

పశ్చిమ బెంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్రం సీరియస్ అయింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై విచారం వ్యక్తం చేసిన హోం శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. తాజా ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరింది.

బెంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని.. కేంద్రానికి మమతా బెనర్జీ తెలిపింది. హింసాత్మక ఘటనల్లో ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలాయ్​ కుమార్​డే కూడా కేంద్రానికి లేఖ రాశారు. కాగా, ఇటీవల టీఎంసీ – బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *