Silver Rate Today(02-02-21): నిన్నటి నుంచి ఈరోజుకి బంగారం ధర తగ్గితే … భారీగా పెరిగిన వెండి ధర

గత ఏడాది కరోనా వైరస్ కల్లోల సమయంలో ముఖ్యంగా ఆగష్టు 7న వెండి ధర భారీగా పెరిగింది. ఆరోజున వెండి ధర కేజీ. రూ. 76,510గా ఉంది. అనంతరం సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ..

Silver Rate Today(02-02-21): నిన్నటి నుంచి ఈరోజుకి బంగారం ధర తగ్గితే ... భారీగా పెరిగిన వెండి ధర
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 9:02 AM

Silver Rate Today(02-02-21): కేంద్రం బడ్జెట్ లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. ఈ నేపథ్యంలో ఓ వైపు బంగారం ధర కొంత మేర తగ్గితే.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో వెండి ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ. 4,600 పెరిగి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 79, 200లకు చేరుకుంది. తులం వెండి ధర రూ. 36. 80 పెరిగి ప్రస్తుతం రూ. 633. 60 గా ఉంది.

గత ఏడాది కరోనా వైరస్ కల్లోల సమయంలో ముఖ్యంగా ఆగష్టు 7న వెండి ధర భారీగా పెరిగింది. ఆరోజున వెండి ధర కేజీ. రూ. 76,510గా ఉంది. అనంతరం సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కనిష్టంగా కేజీ రూ.57,000లకు తగ్గింది. అప్పటి నుంచి వెండి ధరలో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఇవాళ మాత్రం వెండి కేజీ ధర అత్యధిక స్థాయికి చేరుకుందని నిపుణులు చెప్పారు.

Also Read: తగ్గుతున్న బంగారం ధరలు.. గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!