మహారాష్ట్ర గవర్నర్ లేఖ షాకింగ్, శరద్ పవార్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం రేపింది. స్టేట్ లో, ముఖ్యంగా ముంబైలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను మళ్ళీ ఎప్పుడు తెరుస్తారంటూ కోష్యారీ.. థాక్రేకి లేఖ రాశారు. అందులో మీరు హిందుత్వను వీడారా? మీరు సెక్యులర్ అవునా, కాదా అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు లేవనెత్తారు. అయితే  ఆ లేఖలో ఆయన  వాడిన పదజాలం పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఆశ్చర్యాన్ని, అభ్యంతరాన్ని ప్రకటించారు. అత్యున్నత […]

మహారాష్ట్ర గవర్నర్ లేఖ షాకింగ్, శరద్ పవార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 2:55 PM

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం రేపింది. స్టేట్ లో, ముఖ్యంగా ముంబైలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను మళ్ళీ ఎప్పుడు తెరుస్తారంటూ కోష్యారీ.. థాక్రేకి లేఖ రాశారు. అందులో మీరు హిందుత్వను వీడారా? మీరు సెక్యులర్ అవునా, కాదా అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు లేవనెత్తారు. అయితే  ఆ లేఖలో ఆయన  వాడిన పదజాలం పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఆశ్చర్యాన్ని, అభ్యంతరాన్ని ప్రకటించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ప్రవర్తన అందుకు హుందాగా లేదంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆలయాలు, మందిరాలు తెరవడం మాట ఎలా ఉన్నా కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని మీరు పదేపదే సూచిస్తుంటారని పవార్ గుర్తు చేశారు. గవర్నర్ అభిప్రాయాలను తాను ప్రశంసిస్తున్నానని, కానీ ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేయడమేమిటని పవార్ ప్రశ్నించారు. ఆ లెటర్ లోని పదజాలాన్ని మీరు కూడా గమనించాలని కోరారు. ఇదేదో ఓ రాజకీయ నేతకు రాసిన లేఖలా ఉంది తప్ప ఒక ముఖ్యమంత్రికి రాసిందానిలా  లేదు అని పవార్ అన్నారు. గుడులూ, గోపురాలు తెరిచే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు