మోదీకి శివసేన సూటి ప్రశ్న?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం అయోధ్య పర్యటనకు రానున్న క్రమంలో తాము ఆయనకు ఓ ప్రశ్న వేస్తున్నామని శివసేన పేర్కొంది. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న నేపథ్యంలో ముఖానికి ఏ రకమైన ముసుగులు వేసుకోవద్దని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి నిబంధనను భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని శివసేన డిమాండ్‌ చేసింది. ‘రావణుడి శ్రీలంకలో బుర్ఖాల నిషేధాన్ని అమలు చేస్తున్నారు. మరి రాముడి అయోధ్యలో ఎప్పుడు అమలు […]

మోదీకి శివసేన సూటి ప్రశ్న?
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 2:16 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం అయోధ్య పర్యటనకు రానున్న క్రమంలో తాము ఆయనకు ఓ ప్రశ్న వేస్తున్నామని శివసేన పేర్కొంది. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న నేపథ్యంలో ముఖానికి ఏ రకమైన ముసుగులు వేసుకోవద్దని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి నిబంధనను భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని శివసేన డిమాండ్‌ చేసింది.

‘రావణుడి శ్రీలంకలో బుర్ఖాల నిషేధాన్ని అమలు చేస్తున్నారు. మరి రాముడి అయోధ్యలో ఎప్పుడు అమలు చేస్తారు? బుధవారం ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటిస్తున్న నేపథ్యంలో మేము ఈ విషయాన్ని అడుగుతున్నాము. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. బాంబు పేలుళ్ల అనంతరం శ్రీలంక బుర్ఖాతో పాటు ముఖానికి కప్పుకునే అన్ని రకాల ముసుగులపై నిషేధం విధించింది’ అని శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది.