హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు సర్కార్ ఫ్లాన్..!

హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే... మెట్రో రైలు మలి విడత పనులకు శ్రీకారం చుట్టబోతోంది.

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు సర్కార్ ఫ్లాన్..!
Follow us

|

Updated on: Nov 03, 2020 | 3:39 PM

హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే… మెట్రో రైలు మలి విడత పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో దశలో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు మెట్రో స్టేషన్‌ నుంచి ఆర్థిక జిల్లా (ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌) వరకు మెట్రో రైలును విస్తరించబోతున్నారు. మొదటి దశను మించిన రేంజ్‌లో ఈ రెండో దశ ఉండబోతున్నట్లు సమాచారం. 18 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో బస్సుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఆకాశమార్గం ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే… ఔటర్‌ రింగ్‌రోడ్, మూసీ నది ప్రాజెక్టు వంటి వాటితో లింక్ అయ్యేలా… అన్ని చోట్లా… వాహనాల రాకపోకలు శరవేగంగా సాగేలా… ప్లాన్ రెడీ చెయ్యాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణం రెండో దశ మెట్రో ఉండాలని అధికారులకు సూచించారు సీఎస్. మెట్రోతోపాటూ… ఇంకా ఏయే అభివృద్ధి పనులను ఒకే సమయంలో చేపట్టాల అనే అంశాలపై మెట్రోరైలు ఎండీ, పురపాలక, రోడ్లు, భవనాలు, ఆర్థిక, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శులు… ఓ టీంగా ఏర్పాటవుతున్నారు. ఈ సందర్భంగా మెట్రోరైలు రెండో దశ విస్తరణ, ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన విజువల్ ప్రజెంటేషన్‌ను సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. వచ్చే ఐదేళ్ల పాటూ మెట్రోరైలు పనులను ఏఈకామ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, సింగపూర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ మెట్రో మొదటి ఫేజ్‌లోని మూడు కారిడార్లకూ మంచి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా… హైటెక్ సిటీ రూట్,జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఎప్పటిలాగే మళ్లీ రష్ గా మారిపోయింది. దీంతో భవిష్యత్తులో కూడా మెట్రోకి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో దశకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.