మీ రాజకీయాలు అవసరం లేదు: రజనీ, కమల్‌పై కట్టప్ప సెటైర్లు

Satyaraj satirical comments, మీ రాజకీయాలు అవసరం లేదు: రజనీ, కమల్‌పై కట్టప్ప సెటైర్లు

తమిళనాట సినీ ప్రముఖులు చేస్తోన్న రాజకీయంపై నటుడు సత్యరాజ్‌కు కోపం వచ్చింది. దీంతో వారిపై విరుచుకుపడ్డాడు కట్టప్ప. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌లను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు.

తమిళనాట రాజకీయ శూన్యత ఉందన్న రజనీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. మొన్న జరిగిన ఎన్నికల్లో అలాంటిదేమీ లేదని తేలిపోయిందని అన్నారు. ఏదైనా శూన్యత ఉంటే దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్, దయానిధి మారన్ లాంటి వాళ్లు ఉన్నారని సత్యరాజ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలాగే కొత్తగా పార్టీ పెట్టిన వారు కూడా విఫలమయ్యారంటూ కమల్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *