ఏపీ : ఇసుక తవ్వ‌కాలు, ర‌వాణాపై ధ‌ర‌లు నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక తవ్వకాలు, ఎగుమతి, రవాణా, డోర్ డెలివరీకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించింది. వివిధ స్థాయిల్లో బేస్ రేట్లు ఫిక్స్ చేస్తూ గ‌నుల శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏపీ : ఇసుక తవ్వ‌కాలు, ర‌వాణాపై ధ‌ర‌లు నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం
New Sand Policy In AP
Follow us

|

Updated on: Aug 11, 2020 | 10:39 AM

AP Sand transportation charges : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక తవ్వకాలు, ఎగుమతి, రవాణా, డోర్ డెలివరీకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించింది. వివిధ స్థాయిల్లో బేస్ రేట్లు ఫిక్స్ చేస్తూ గ‌నుల శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆ వివ‌రాలు : 

  • ఓపెన్ రీచ్‌లు, ప‌ట్టాదారు భూముల్లో కూలీల ద్వారా ఇసుక తవ్వకాలకు టన్నుకు రూ. 90
  • స్టాక్ యార్డులో ఇసుక పొక్లెయిన్ ద్వారా లోడ్ చేసేందుకు టన్నుకు రూ. 25.
  • ఇసుక రీచ్‌లు, పట్టా ల్యాండ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుక రవాణాకు టన్నుకు రూ. 4.90
  • గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణాకు టన్నుకు జీఎస్టీతో క‌లిసి రూ. 3.30.

ఇసుక డోర్ డెలివరీ కోసం 10 కిలోమీట‌ర్లు దూరానికి ట్రాక్ట‌ర్ ద్వారా ట‌న్నుకు రూ. 10, లారీ ద్వారా ట‌న్నులు రూ. 8, పెద్ద లారీ అయితే ట‌న్నుకు రూ. 7 వ‌సూలు చేయ‌నున్నారు. ఈ ధ‌ర‌లు 40 కిలోమీట‌ర్లు దూరం వ‌ర‌కు వ‌ర్తిస్తాయి. 40 కిలోమీట‌ర్లు దాటిన నేప‌థ్యంలో ట‌న్నుకు అద‌నంగా రూ. 4.90 చొప్పున ధ‌ర‌ను ఫైనల్ చేశారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే ఈ-టెండర్లకు వెళ్లేలా ఆయా శాఖ‌ల‌కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.