పూజ తర్వాత ఇలా చేశావేంటి సల్మాన్..? కడిగేస్తున్న నెటిజన్లు

గణేశ్ ఉత్సవాల్లో భాగాంగా మద్యం సీసాలను తాగుతూ హల్‌చల్ చేసిన ఘటన మరిచిపోకముందే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన సోదరి అర్పితా ఇంట్లో జరిగిన గణేశ్ ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ హాజరయ్యారు. ఆయన అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన తన మిత్రులతో కలిసి అక్కడే ఓ మూలన చెట్టు వద్దకు వచ్చి సిగరెట్ కాల్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పవిత్రమైన పూజా కార్యక్రమాలకు వచ్చిన సల్మాన్ ఇలా […]

పూజ తర్వాత  ఇలా చేశావేంటి సల్మాన్..? కడిగేస్తున్న నెటిజన్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 08, 2019 | 2:24 PM

గణేశ్ ఉత్సవాల్లో భాగాంగా మద్యం సీసాలను తాగుతూ హల్‌చల్ చేసిన ఘటన మరిచిపోకముందే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన సోదరి అర్పితా ఇంట్లో జరిగిన గణేశ్ ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ హాజరయ్యారు. ఆయన అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన తన మిత్రులతో కలిసి అక్కడే ఓ మూలన చెట్టు వద్దకు వచ్చి సిగరెట్ కాల్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పవిత్రమైన పూజా కార్యక్రమాలకు వచ్చిన సల్మాన్ ఇలా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అయితే సల్మాన్ అప్పటివరకు జరిగిన పూజల్లో చాల భక్తి భావంతో పాల్గొన్నారని, పూజ ముగిసిన తర్వాతే ఆయన ఇలా సిగరెట్ కాల్చారంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం బాగా చల్లగా ఉంది. అందుకే ఇలా సిగరెట్ వెలిగించి ఉంటారని కూడా మరికొంతమంది అనుకుంటున్నారు.