Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

బాలయ్య సినిమాలో రోజా ఇంట్రెస్టింగ్ రోల్..! ఆమెకు చెక్ పడుతుందా..?

రాజకీయంగా వేరైనా.. సినీ ఇండస్ట్రీకి వస్తే.. తనమన భేదం ఉండదు.. అందరూ యాక్టర్స్‌నే.  ఇదే పాయింట్ రోజా, బాలయ్యలకు వర్తిస్తుందా..? ఇద్దరూ నవ్వుకుంటూ.. షూటింగ్‌లో పాల్గొంటారా..? ఇప్పుడు రోజా.. బాలకృష్ణ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. బాలయ్య సినిమాలో.. రోజా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుందనే వార్త.. ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది.

రోజా.. రాజకీయాల్లోకి వెళ్లాక.. నటనకు కాస్త దూరంగా ఉంది. రాజకీయాల్లో బిజిబిజీగా.. ఉంటోంది. దీంతో.. ఆమెకు సినిమాల్లో అవకాశాలొచ్చినా.. పాలిటిక్స్‌లో బిజీ కారణంగా.. అటు వైపు మొగ్గు చూపడం లేదు. కేవలం.. జబర్దస్త్ షో మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది. అప్పటికీ దానిపై కూడా ఫుల్‌గా కాంట్రవర్సీలు అల్లుకుంటున్నాయి. ఈ క్రమంలో.. బాలయ్య సినిమాలో.. రోజాకి ఓ స్పెషల్‌ ఆఫర్ వచ్చిందట.

105 సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం రోజాను.. బోయపాటి సంప్రదించినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నెగిటీవ్‌‌గా కనిపించే పాజిటీవ్‌ పాత్రని.. అది రోజాకు ఫర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని బోయపాటి ఆలోచన అట. సినిమాలో ఇంటర్‌వెల్ వద్ద రివీల్ అయ్యే సీన్ అదని.. సెకంఢాఫ్ మొత్తం ఈ సీన్ కంటిన్యూ అవుతందని సమాచారం. అయితే.. ఆ పాత్ర రాజకీయాలకు సంబంధించి ఉండటంతో.. రోజా నో చెప్పిందట. ఒకవేళ వాటిని తొలగిస్తే.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారోమో అని టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా.. ఒక పక్క పాలిటిక్స్‌లో ఉన్న రోజా.. సడన్‌గా సినిమాలో రీ ఎంట్రీ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా.. రాజకీయాలపై పడుతుంది. అందులోనూ.. బాలకృష్ణతో సినిమా అనే సరికి.. రోజా వర్గీయులు ఒప్పుకుంటారో లేదో.. ఏదైమైనా.. ఒక సినిమా.. రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేయడం ఖాయమనే అనిపిస్తుంది.