అక్కడి రూల్స్ కాస్త వేరు.. హెల్మెట్ లేకుండా దొరికితే..!

Riding without a helmet in Rajasthan? Govt may give you a free helmet with Rs 1000 challan, అక్కడి రూల్స్ కాస్త వేరు.. హెల్మెట్ లేకుండా దొరికితే..!

కొత్త మోటర్ వెహికిల్ చట్టం అమలులోకి వచ్చాకా.. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వాహనదారులకు దిమ్మతిరిగేలా చలాన్లు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చలాన్లు విధిస్తుండటంపై అప్పుడే ప్రభుత్వాల తీరుపై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 500/- రూపాయల హెల్మెట్‌కు 1000/- చలానా అంటూ ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే నెటిజన్ల ఆవేదనను అర్థం చేసుకుందో.. లేదా.. సామాన్యుడి రక్షణ కోరిందో ఏమో గాని.. రాజస్థాన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో హెల్మెట్ లేకుండా చిక్కితే.. చలానాతో పాటుగా హెల్మెట్‌ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే.. వారికి 1000/- చలానా విధించి, ఆ డబ్బు చెల్లించిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్కు ఉన్న ఓ హెల్మెట్ ను ఉచితంగా ఇవ్వనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులకు భారీ జరిమానాలు విధించమని రాజస్థాన్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ చెప్పారు. రాజస్థాన్ ప్రజల సెంటిమెంటును పరిగణనలోకి తీసుకొని హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపిన వారినుంచి వెయ్యిరూపాయల చలానా విధించి, వారికి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ ను ఉచితంగా అందిస్తామని మంత్రి ప్రకటించారు. రోడ్డు భద్రతపై వాహనదారులను చైతన్యవంతులను చేసేలా ప్రాథమికంగా నామమాత్రపు చలానాలు విధించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపితే వందరూపాయలున్న జరిమానాను వెయ్యిరూపాయలకు పెంచి, చలానా విధించి, ఆ మొత్తాన్ని చెల్లించిన వారి భద్రత కోసం ఉచితంగా హెల్మెట్ అందజేస్తామని మంత్రి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాల విధింపు విషయంలో రాజస్థాన్ సర్కారు తొందర పడటం లేదని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *