త్వరలో అందుబాటులోకి జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ

150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించిందని కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. గత ఏజీఎంలో చెప్పినట్లుగానే కరోనా విజృంభణ సమయంలోనూ రిలయన్స్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం సంతోషంగా ఉందన్నారు.

త్వరలో అందుబాటులోకి జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ
Follow us

|

Updated on: Jul 15, 2020 | 3:16 PM

150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించిందని కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. గత ఏజీఎంలో చెప్పినట్లుగానే కరోనా విజృంభణ సమయంలోనూ రిలయన్స్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం సంతోషంగా ఉందన్నారు.

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం బుధవారం వర్చువల్ పద్దతిలో వీడియో కాల్ విధానంలో ప్రారంభమైంది. మానవ చరిత్రలోనే కరోనావైరస్‌ అత్యంత ఇబ్బంది కరమైన పరిస్థితి నెలకొందన్న ముకేశ్‌ అంబానీ.. కొవిడ తర్వాత భారత్‌తో పాటు ప్రపంచం దేశాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామన్నారు. ప్రతి కష్టం చాలా అవకాశాలు ఇస్తుందన్న ముకేశ్.. భారత్‌లో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూని కూడా పూర్తి చేశామన్నారు. అటు, జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్‌ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని, ఇక కన్జ్యూమర్‌ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందని వివరించారు. భారత్‌లో వేగంగా పెరిగిన డేటా డిమాండ్‌ను తట్టుకొని జియో నిలిచిందని.. జియో సొంతంగా 5జీని అభివృద్ధి చేసిందని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ఇకపై ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు అందుతాయన్నారు. ఇది వచ్చే ఏడాది నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని, త్వరలోనే పరీక్షిస్తామని వివరించారు.

త్వరలో ఆర్థిక రంగంలోనే గొప్ప డీల్ కుదరబోతుందన్న ఆయన, కొన్ని వారాల్లో గూగుల్‌తో ఒప్పందం ఖరారవ్వచ్చనీ బ్లూంబర్గ్‌ పేర్కొంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌ సహా దిగ్గజ టెక్నాలజీ, పెట్టుబడి సంస్థలు రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టాయి. రాబోయే ఐదేళ్లలో భారత్‌లో రూ.75,000 కోట్ల (అంటే 1000 కోట్ల డాలర్ల) పెట్టుబడులు పెడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సోమవారం ప్రకటించారు.