మోదీ న్యూ స్ట్రాటజీ..! రాజ్ నాథ్ సింగ్ హోదా తగ్గించారా ?

, మోదీ  న్యూ స్ట్రాటజీ..! రాజ్ నాథ్ సింగ్ హోదా తగ్గించారా ?

ప్రధాని మోదీ తన రెండో ప్రభుత్వ హయాంలో .. తనకు కుడిభుజంగా ఉన్న అమిత్ షాకు సెకండ్ ప్లేస్ ఇఛ్చి… పెద్ద పీట వేయడం. నిన్న మొన్నటివరకు కేబినెట్లో తన తరువాత రెండో స్థానంలో ఉన్న రాజ్ నాథ్ సింగ్ ప్రాధాన్యాన్ని తగ్గించడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఇటీవలివరకు హోమ్ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ ను ఆ పదవి నుంచి తప్పించి రక్షణ శాఖ మంత్రిగా నియమించినా.. కీలకమైన కేబినెట్ కమిటీల్లో ఆయనకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. రాజ్ నాథ్ బదులు అమిత్ షాని అన్ని.. 8 కేబినెట్ కమిటీల్లోనూ నియమించారు.

, మోదీ  న్యూ స్ట్రాటజీ..! రాజ్ నాథ్ సింగ్ హోదా తగ్గించారా ?

అత్యంత ముఖ్యమైన రాజకీయ వ్యవహారాలపై గల కమిటీనుంచి రాజ్ నాథ్ ని తప్పించడం విశేషం.ఆర్ధిక వ్యవహారాలపై గల కమిటీలోను, భద్రతా వ్యవహారాల కమిటీలోనూ రాజ్ నాథ్ సింగ్ కు స్థానం కల్పించారు. అటు- ఎనిమిది కమిటీల్లో మోదీ ఆరింటిలో ఉండగా.. రాజ్ నాథ్ రెండు పానెల్స్ లో ఉన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు కమిటీల్లో, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అయిదు కమిటీల్లో ఉన్నారు. భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీలో మోదీ తో బాటు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ ఉన్నారు. రాజ్ నాథ్ ప్రాధాన్యాన్ని తగ్గించారా అన్న సందేహాలను లేవనెత్తుతున్న విశ్లేషకులు.. బహుశా జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తతలను తగ్గించడంలో ఆయన విఫలమైనందుకే మోదీ ఈ చర్య తీసుకున్నారా అని భావిస్తున్నారు. రాజ్ నాథ్ హోమ్ మంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు, మైనారిటీల మీదదౌర్జన్యాలు జరుగుతూ వచ్చా యి. తాజాగా ఆయనను రక్షణ శాఖ మంత్రిగా తీసుకున్నారు. అయితే రంజాన్ పండుగ రోజున కూడా కాశ్మీర్ లో వేర్పాటువాదులు ఉగ్రవాదులకు అనుకూలంగా ప్రదర్శనలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. సియాచిన్ ను రాజ్ నాథ్ సందర్శించి వఛ్చిన మరుసటి రోజే ఈ ఘటనలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *