మరో అల్పపీడన ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.!

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరో అల్పపీడన ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.!
Follow us

|

Updated on: Aug 02, 2020 | 5:49 PM

Rain Alert In Telugu States: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగష్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో రాగాల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

ఉత్తర కోస్తాంధ్రా, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కోస్తాంధ్రాలోని పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణ కోస్తాంధ్రా: ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఇక అటు తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

Also Read: షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..