‘రేడియేషన్’ను పెంచిన కార్చిచ్చు

చెర్నోబిల్ చుట్టుపక్కల ఉన్న నిషేధిత మండలంలో రేడియేషన్ స్థాయిలు పెరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు ఆదివారం వివరించారు. సాధారణం కంటే 16 రెట్లు రేడియేషన్ ఎక్కువగా ఉన్నట్లు ఉక్రెయిన్ రాష్ట్ర పర్యావరణ

'రేడియేషన్'ను పెంచిన కార్చిచ్చు
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 2:37 PM

చెర్నోబిల్ చుట్టుపక్కల ఉన్న నిషేధిత మండలంలో రేడియేషన్ స్థాయి పెరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు ఆదివారం వివరించారు. సాధారణం కంటే 16 రెట్లు రేడియేషన్ ఎక్కువగా ఉన్నట్లు ఉక్రెయిన్ రాష్ట్ర పర్యావరణ తనిఖీ సేవ అధిపతి యెగోర్ ఫిర్సోవ్ తెలిపారు. అడవిలో ఏర్పడ్డ కార్చిచ్చు సుమారు 100 హెక్టార్ల (250 ఎకరాల) అటవీ ప్రాంతానికి వ్యాపించిందని ఫిర్సోవ్ పేర్కొన్నారు. రెండు విమానాలు, ఒక హెలికాప్టర్, సుమారు 100 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆదివారం మంటలు తగ్గాయి, గాలిలో రేడియేషన్ పెరుగుదల కూడా తగ్గింది.

కాగా.. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన రేడియేషన్ మంటలను ఎదుర్కోవడంలో “ఇబ్బందులకు” దారితీసిందని, సమీపంలో నివసించే ప్రజలు ప్రమాదంలో లేరని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1986 లో నాల్గవ రియాక్టర్ పేలినప్పుడు చెర్నోబిల్ యూరప్ ను కలుషితం చేసింది, విద్యుత్ ప్లాంట్ చుట్టూ ఉన్న ప్రాంతం వెంటనే తీవ్రంగా ప్రభావితమైంది. విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల (18 మైళ్ళు) లోపల ప్రజలు నివసించడానికి అనుమతి లేదు. చివరకు 2000 లో విద్యుత్ కేంద్రం మూసివేసే వరకు చెర్నోబిల్‌లోని మరో మూడు రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాయి. 2016 లో నాల్గవ రియాక్టర్‌పై ఒక పెద్ద రక్షణ కవచం ఉంచబడింది. ఉపయోగించని విద్యుత్ ప్లాంట్ సమీపంలోని అడవుల్లో మంటలు సర్వసాధారణం అని తెలుస్తోంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!