Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజస్థాన్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం. కాసేపట్లో ఎమ్మెల్యేలతో చర్చించనున్న సీఎం అశోక్ గెహ్లాట్. సమావేశానికి దూరంగా సచిన్ పైలట్, అతని అసమ్మతి వర్గం. ఉదయం గం. 10.00కే ప్రారంభం కావాల్సిన భేటీ. కొందరు ఎమ్మెల్యేలు క్యాంపు దాటి వెళ్లిపోవడంతో ఆలస్యం.
  • అమరావతి: ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్. హాజరైన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి.
  • అనంతపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందారని ఆందోళన. డోన్ నుంచి రఘురామయ్య అనే పేషేంట్ ఊపిరి ఆడని పరిస్థితిలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి. వైద్యులు ఆక్సిజన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం తో బాధితుడు మృతి చెందారని ఆందోళన.
  • అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం . అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు . తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు . గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం. ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా గుర్తించిన ఏపీ.
  • శాఖ సాల్వెంట్ కర్మాగారంలో ప్రమాదం దురదృష్టకరం..పవన్ కల్యాణ్ . మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయిన శ్రీ మల్లేష్ కు మెరుగైన వైద్య సహాయం అందచేయాలి..పవన్ కల్యాణ్. సహాయ కార్యక్రమాల్లో జనసేనికులు పాల్గొనాలని కోరాను. మృతుని కుటుంబానికి, గాయపడినవారికి సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలి. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..పవన్ కల్యాణ్.
  • వికారాబాద్ పట్టణంలో కరోనా వైరస్ పాసిటివ్ కేసులు ఎక్కువడంతో అన్నిరకాల వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు కరోనా వైరస్ వ్యాప్తినియంత్రించేందుకు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు 10 రోజుల పాటు పట్టణము లోని అన్ని షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
  • విశాఖ: క్రైమ్ డీసిపీ సురేష్ బాబు కామెంట్స్ . పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించాము. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. విచారణ అనంతరం వాస్తవాలు బయటికి వస్తాయి.

లాక్‌డౌన్ సడలింపులు: ప్రైవేట్ హెలికాప్టర్లు, ఫ్లైట్లకు గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను నడుపుతున్న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, తాజాగా ప్రైవేట్ హెలికాప్టర్లు
Lockdown India Exemptions, లాక్‌డౌన్ సడలింపులు: ప్రైవేట్ హెలికాప్టర్లు, ఫ్లైట్లకు గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను నడుపుతున్న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, తాజాగా ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్‌ ఫ్లైట్లకు కూడా అనుమతిని ఇచ్చింది. అయితే వేరే రాష్ట్రంలోకి వెళ్లే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఇక దేశీయ విమానాలకు వర్తించే మార్గదర్శకాలే వీటికి కూడా వర్తిస్తాయని తెలిపింది.

ప్రయాణానికి 45 నిమిషాల ముందుగా ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకొని థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, వృద్ధులు, గర్భవతులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణాలను మానుకోవడమే మంచిదని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ధర విషయంలో ఆపరేటర్, ప్యాసెంజర్‌ మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవాలని పేర్కొంది. అలాగే ఆహారం వెంట తెచ్చుకోవాలని, వెబ్‌ చెక్ ఇన్, ఎలక్ట్రానిక్ పేమెంట్ తప్పనిసరని వెల్లడించింది. ఇక ఫేస్ మాస్క్‌ ధరించాలని, ఆరోగ్య సేతు యాప్‌ కూడా ఉండాలని తెలిపింది. ఒకవేళ యాప్ లేకపోతే స్వయంగా డిక్లరేషన్ పత్రం ఇవ్వాలని సూచించింది. వీటన్నింటితో పాటు ప్రయాణం తరువాత ఎయిర్‌క్రాఫ్ట్ లేదా హెలికాప్టర్‌ని తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని తెలిపింది. కాగా కేంద్ర తాజా సడలింపులతో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఈ హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Read This Story Also: ఏపీలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి నిరాకరణ

Related Tags