President concerns: లాక్ డౌన్‌లో ఆ రెండే ఫెయిల్యూర్స్… రాష్ట్రపతి కామెంట్

లాక్ డౌన్ అమలుపై పాలక ప్రతిపక్షాల మాటలెలా వున్నా రాష్ట్రపతి లాంటి అత్యున్నత వ్యక్తులు చేసే కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం లాక్ డౌన్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో...

President concerns: లాక్ డౌన్‌లో ఆ రెండే ఫెయిల్యూర్స్... రాష్ట్రపతి కామెంట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 6:01 PM

President Kovind comment on lock-down: లాక్ డౌన్ అమలుపై పాలక ప్రతిపక్షాల మాటలెలా వున్నా రాష్ట్రపతి లాంటి అత్యున్నత వ్యక్తులు చేసే కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం లాక్ డౌన్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలకమై కామెంట్లు చేశారు. లాక్ డౌన్‌ అమలులో ప్రధానంగా రెండు ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనాను నియంత్రించేందుకు కేంద్ర చేపట్టిన పకడ్బందీ చర్యలకు రెండు ఉదంతాలు విఘాతంగా మారాయని, ఆ రెండు ఉదంతాలు చోటుచేసుకోకపోతే.. కరోనా నియంత్రణా చర్యలు, లాక్ డౌన్ అమలు కూడా పూర్తిగా సక్సెస్ అయి వుండేవని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ అమలు అవడం ప్రారంభం కాగానే వలస కార్మికులు వేలాదిగా రాష్ట్రాల మధ్య రవాణాకు సిద్దపడడం, ఆనంద్ విహార్ లాంటి ప్రాంతాల్లో వేలాదిగా మోహరించం సోషల్ డిస్టెన్సింగ్ లక్ష్యాన్ని నీరు గార్చిందని కోవింద్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు కరోనా నియంత్రణలో సానుకూల ఫలితాలు సాధిస్తున్నామని సంతోషించే సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్ ఏరియాలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సు ప్రతిఘాతంగా మారిందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ పీరియడ్‌లో ఏ ఒక్కరు ఆకలితో బాధపడకుండా కేంద్ర, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్న రాష్ట్రపతి… ఆ విధంగా పరిస్థితులు వున్నాయా లేవా అనే అంశంపై గవర్నర్లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

భయంకరమైన కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలను ఫణంగా పెట్టి శ్రమిస్తున్న డాక్టర్లు, మెడికల్ వర్కర్లు, ఆశావర్కర్లపై జరగుతున్న దాడులపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే పది రోజులు చాలా కీలకమైన తరుణంలో సామాజిక దూరాన్ని పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Articles