‘తానా’ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కాయి. వాషింగ్‌టన్ డీసీలో జరుగుతున్న ‘తానా’ 22 మహా సభలు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వేదికగా మారింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’తోపాటు పార్టీ విలీనాలకు చర్చకు తానా సభనే వేదిక చేసుకున్నారు పలు పార్టీల నేతలు. అయితే.. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలతో పాటు పలు రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. భవిష్యత్తు రాజకీయాలకు ‘తానా’ వేదికగా జరిగిన చర్చలే నాంది పలకబోతున్నాయా..? అనే చర్చ మొదలైంది.