ప్రతాప్ సారంగి..ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ !

|

Jun 03, 2019 | 2:28 PM

గతనెల 30 న ప్రధాని మోదీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో అతిరథ, మహారథుల మధ్య అట్టహాసంగా జరిగింది. విశిష్ట అతిథుల సమక్షంలో నూతనంగా ఎంపికైనవారిని ఒక్కొక్కరిని వేదికపైకి పిలుస్తుండగా.. ఒక పేరు.’ ప్రతాప్ చంద్ర సారంగి ‘ అన్న పేరును పలకగానే ఒత్తయిన తెల్లని గడ్డంతో, తెల్లని దుస్తుల్లో అతి సాధారణ వ్యక్తిలా ఒకరు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు .ఆయన ‘ నిరాడంబరత చూసి అంతా ముగ్ధులై.. ఒక్కసారిగా లేచి […]

ప్రతాప్ సారంగి..ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ !
Follow us on

గతనెల 30 న ప్రధాని మోదీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో అతిరథ, మహారథుల మధ్య అట్టహాసంగా జరిగింది. విశిష్ట అతిథుల సమక్షంలో నూతనంగా ఎంపికైనవారిని ఒక్కొక్కరిని వేదికపైకి పిలుస్తుండగా.. ఒక పేరు.’ ప్రతాప్ చంద్ర సారంగి ‘ అన్న పేరును పలకగానే ఒత్తయిన తెల్లని గడ్డంతో, తెల్లని దుస్తుల్లో అతి సాధారణ వ్యక్తిలా ఒకరు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు .ఆయన ‘ నిరాడంబరత చూసి అంతా ముగ్ధులై.. ఒక్కసారిగా లేచి నిలబడికరతాళ ధ్వనులు చేశారు. ఆయనను ‘ఒడిశాకు చెందిన అపర మోదీ ‘ అని, ‘ బీజేపీ గాంధీ ‘ అని, సింపుల్ లైఫ్ గడిపే యోగి అని ప్రశంసల వర్షం కురిపించారు. ఓ చిన్న గుడిసె వంటి పాకలో మామూలు సాదా, సీదా జీవితం గడిపే బ్యాచిలర్ గా అందరూ అభివర్ణించి.. ఇంతటి సామాన్యుడికి మోదీ తన మంత్రివర్గంలో చోటు కల్పించడం పెద్ద విశేషమేనని పొంగిపోయారు.

అయితే ప్రతాప్ సారంగి గత జీవితంలోకి ఒక్కసారి తొంగి చూస్తే.. 1999 లో నాడు బజరంగ్ దళ్ ఒడిశా శాఖ అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తున్న సందర్భమది.. ఆ నాడు ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, ఆయన మైనర్ కొడుకులిద్దరినీ బజరంగ్ దళ్ కార్యకర్తలు సజీవదహనం చేశారు. మనోహరా పూర్-కియోంజర్ ప్రాంతంలో జరిగిందా ఘటన.. ఆ పరిసర ప్రాంతాల్లో హిందువులను బలవంతంగా క్రిస్టియానిటీలోకి (మత) మార్పిడి చేస్తున్నారని గ్రాహం స్టెయిన్స్ పైనా, నిండా పదిహేనేళ్ళు కూడా లేని ఆయన కుమారులపైనా కక్ష గట్టిన వారు ఆ దారుణానికి పాల్పడ్డారు.

ఆ కేసులో ప్రతాప్ సారంగి ప్రమేయం ఉందా, లేదా అన్న విషయాన్ని పక్కనబెట్టి.. దారాసింగ్ అనే బజరంగ్ దళ్ కార్యకర్తను, అతని సహచరుడైన మహేంద్ర హెబ్రం ను పోలీసులు అరెస్టు చేయగా వారికి జీవిత ఖైదు పడింది. ఈ ఘటనకు సంబంధించి ఫ్రంట్ లైన్ పత్రికలో 2003 లో వఛ్చిన కథనం ప్రకారం.. నాడు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్.. అసలు ఈ సంఘటనలో బజరంగ్ దళ్ ప్రమేయమే లేదని స్పష్టం చేసిందట. ఈ సంస్థ ఇల్లీగల్ (అక్రమ) సంస్థ కాదని, లీగల్ సంస్థలు ఇలాంటి దారుణాలకు పాల్పడవని ఆ కమిషన్ తన నివేదికలో పేర్కొందట. అంటే సారంగీ పేరు ఎక్కడా బయటపడలేదన్న మాట.. 2004, 2009 లో ఈయన బాలాసోర్ జిల్లాలోని నీలగిరి నియోజకవర్గం నుంచి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బాలాసోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. విశ్వహిందూ పరిషత్ తో కూడా సంబంధాలున్నసారంగిపై సుమారు 10 క్రిమినల్ కేసులున్నాయి. అయితే ఏ కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ కాకపోవడం విచిత్రం. 2002 లో ఒడిశా అసెంబ్లీపై దాడి చేశారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న అభియోగాలు ఈయనపై ఉన్నాయి. ఇంతటి హిస్టరీ ఉన్న నారంగి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు.