చంద్రబాబు చేసిన తప్పులు ఏపీ సీఎం జగన్ చేయవద్దన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె. ఎన్డీయేతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా పనిచేయొద్దని తాను సూచించినా.. చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు.
ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీయేతో సఖ్యతగా ఉండాలని సూచించారు రాందాస్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. కేసీఆర్ కూడా ఎన్డీయేలో చేరాలని సూచించారు. ఎన్డీయే అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు.