తెలంగాణలో తెల్లరేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తేనే రేషన్ బియ్యం ఇచ్చేలా నిబంధనను మార్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధన నేపథ్యంలో జనం ఆధార్‌తో ఫోన్ నంబర్ లింక్ చేయడం కోసం భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునేంచే ఆధార్ కేంద్రాల వద్ద రోజంతా సాగిలపడి కూర్చుంటున్నారు.
తెలంగాణ రేషన్ దుకాణాల్లో ఫిబ్రవరి 1 నుంచి ఓటీపీ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇంతకు వేలి ముద్రలతో రేషన్ ఇవ్వగా.. కరోనా నేపథ్యంలో నిబంధలను మార్చారు. రేషన్ దుకాణాల్లో సరకులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీపీ చెప్పాలనే నిబంధన విధించారు. లబ్ధిదారుల ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయితేనే ఓటీపీ వస్తుంది.
కరోనా నేపథ్యంలో ఐరిష్ విధానం ద్వారా రేషన్ బియ్యం తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ తప్పని సరి చేసింది. అయితే బియ్యమేమో కానీ తమ ప్రాణాలు పోయేట్లు ఉన్నాయని వృద్ధ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రురల్ జిల్లా వర్ధన్నపేట మండలం లో జరిగింది
రేషన్ దుకాణాల ద్వారా అందించే నిత్యావసర వస్తువులు గతంలో రేషన్ కార్డు వేలిముద్రల ద్వారా ఇచ్చేవారు…కరోన నేపత్యంలో వేలి ముద్రల ద్వారా వ్యాధి తొందరగా ఇతరులకు అంటుకునే ప్రమాదం వున్నదని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఐరిష్ విధానం ద్వారా ఇవ్వాలని ఇందుకుగాను ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసందానం చేయడం అనివార్యం అయింది…దీనితో ప్రతి ఆధార్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి ఆధార్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు.
మండలంలో తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడం వలన ఒంటరి స్త్రీలు , వృద్దులు ఉదయం వచ్చి బయట ఎండలో వేచివుండటం రోజుకు కొందరికే అద్దార్ లింకు కావడం వలన ఇబ్బందులు పడుచున్నామని కనీసం నిలువ నీడ లేదని , త్రాగు నీరు కూడా లేకపోవడం వలన ఇబ్బందులు పడుచున్నామని ఇకనైనా మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని నాయకులకు మొరపెట్టుకున్నారు మహిళలు….
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తమ రేషన్ కార్డులకు ఓటీపీని లింక్ చేసుకోలేదు. దీంతో రేషన్ సరకులను పొందడం కోసం జనం ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనం ఆధార్ కేంద్రాల వద్దకు చేరుకొని లైన్లో నిలబడుతున్నారు. ఇదే అదనుగా ఆధార్ కేంద్రాల నిర్వాహకులు కొందరు అధిక మొత్తం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 87,44,251 రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు.
ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం కోసం పోస్ట్ ఆఫీసులను వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో.. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి.
Read More: