BJP Plan: వరసగా తెలంగాణకు అగ్ర నేతలు.. ఈ నెల చివరి వారంలో రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోకస్ పెంచింది. డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్... ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇందు కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా రెడీ రూపొందించింది.

BJP Plan: వరసగా తెలంగాణకు అగ్ర నేతలు.. ఈ నెల చివరి వారంలో రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా
Pm Modi, Amit Shah, Jp Nadda
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:13 PM

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోకస్ పెంచింది. డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్… ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇందు కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా రెడీ రూపొందించింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తాజాగా మరోసారి ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని పర్యటించిన ప్రధాని మోదీ ఆదిలాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజ్‌గిరి సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ నెల చివరి వారంలో రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. మోదీ రాక సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో మోదీ పర్యటనను దిగ్విజయం చేసేందుకు కషాయం దళం సిద్ధమవుతోంది. ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు నేతలు. మోదీ సభలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల తర్వాత ప్రచారాన్ని మరింత హోరెత్తించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. రెండో దశ పోలింగ్ తర్వాత వరసగా తెలంగాణకు అగ్ర నేతల క్యూ కడుతున్నారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…