కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అమెరికా పర్యటన నుంచి మధ్యలోనే బెంగళూరుకి తిరిగి వచ్చేశారు సీఎం కుమారస్వామి. కొద్దిసేపటి క్రితమే బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. తాజా పరిస్థితిపై వారిని అడిగి తెలుసుకున్న కుమారస్వామి అక్కడ్నించి నేరుగా తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్‌కు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రస్తుత సంక్షోభాన్ని తెరదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చిస్తున్నారు.
Karnataka Chief Minister HD Kumaraswamy arrived at HAL Airport in Bengaluru pic.twitter.com/F3lf2jhHGS
— ANI (@ANI) July 7, 2019