హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలోకి బీజేపీ నేత తేజస్వి సూర్య ప్రవేశం, పోలీసు కేసు నమోదు

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి  బీజేపీ నేత తేజస్వి సూర్య బలవంతంగా ప్రవేశించారంటూ ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు..

  • Umakanth Rao
  • Publish Date - 4:58 pm, Thu, 26 November 20

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి  బీజేపీ నేత తేజస్వి సూర్య బలవంతంగా ప్రవేశించారంటూ ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జీ హెచ్ ఎం సి ఎన్నికల  ప్రచారం కోసమని వచ్చిన ఆయన  ఈ నెల 24 న  అనుమతి లేకుండా ఇక్కడ అక్రమంగా ప్రవేశించారని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. బెంగుళూరు నుంచి తన అనుచరులతో వఛ్చిన సూర్య..కాంపస్ లో ఏర్పాటు చేసిన బారికేడ్లను,  ఇనుప కంచెను తొలగించుకుని వచ్చారని పోలీసులు తెలిపారు. అయితే వారు తనను అడ్డుకోవడాన్ని సూర్య తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన తనను అడ్డుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆర్ట్స్ కాలేజీవిద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి తాను వఛ్చినట్టు ఆయన తెలిపారు. కాగా.. అక్కడ బ్యారికేడ్లను, కంచెను యూనివర్సిటీయే ఏర్పాటు చేసిందని, తాము కాదని పోలీసులు చెబుతున్నారు.