Breaking News
  • తెలంగాణలో వర్షాలను కేంద్రం గమనిస్తోంది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుంది. వైపరీత్యాల వల్ల చనిపోయినవారికి.. రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని మోదీ గతంలోనే నిర్ణయించారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఖర్చు చేయాలి. తర్వాత కేంద్రం రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది-కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.
  • అమరావతి: ఉపాధి హామీ కూలీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఉపాధి కూలీలకు మంత్రి ధర్మాన క్షమాపణ చెప్పాలి-టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో నేడు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని.
  • దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్. కర్నాటక లోకాయుక్తను ఆశ్రయించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించిన యాజమాన్యం. 33 బస్సులు, లారీలను కర్నాటకలో నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్. లోకాయుక్తకు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కర్నాటక రవాణాశాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు.

అద్దె కట్టమంటున్నారా.. అయితే జైలుకే..!

, అద్దె కట్టమంటున్నారా.. అయితే జైలుకే..!

కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. చేసేందుకు పని లేక ఇల్లు కదలలేక పూట గడవని పరిస్థితి. మరోవైపు ఇంటి అద్దెలు కట్టాలంటూ వేధించేవారిపై కఠినచర్యలు తప్పవంటున్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో అద్దె క‌ట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న విద్యార్థులు కాలేజీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ఇళ్ల‌లో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అద్దె క‌ట్టాలంటూ విద్యార్థుల‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై కేసు న‌మోదు చేశారు. IPC సెక్షన్ 188 కింద ఇంటి యజ‌మానుల‌పై కేసు న‌మోదు చేశారు. దీంతో వారికి ఒక నెల జైలుశిక్షతో పాటు జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతంలోనూ సేమ్ సీన్. కోట్ల ముబారక్‌పూర్‌లో అద్దె చెల్లించ‌లేదని.. విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను తీసేశారు. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించగా..ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌రిష్కారం కుదర‌డంతో ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు.

నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా ఒత్తిడి చేసినా, ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపినా హెల్ప్ లైన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.

Related Tags