వరద సాయంపై అసత్య ప్రచారం.. గ్రూప్ ఫొటో పేరుతో పుకారు షికారు.. ఫొటో స్టూడియోల ఎదుట బారులు తీరుతున్న జనాలు..

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొట్టుకుపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారు.

వరద సాయంపై అసత్య ప్రచారం.. గ్రూప్ ఫొటో పేరుతో పుకారు షికారు.. ఫొటో స్టూడియోల ఎదుట బారులు తీరుతున్న జనాలు..
Follow us

|

Updated on: Nov 21, 2020 | 3:19 PM

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొట్టుకుపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారు. మూడు రోజులుగా నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. దీంతో వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించింది. ఇందుకోసం గుర్తింపు పత్రాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.. దీంతో వరదల్లో నష్టపోయిన బాధితులు ఆర్థిక సాయం కోసం వారం రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.. అయితే మీ సేవలో దరఖాస్తు చేసుకున్నవారికి డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి డబ్బులు వేస్తున్నారని తెలియడంతో.. రెండు రోజులుగా మీ సేవా కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. ఇంతలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. మిగిలిన వారికి ఎన్నికల అనంతరం అందిస్తామని ప్రకటన కూడా చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త పుకారు షికారు చేస్తోంది.. బాధితులు కుటుంబంతో కలిసిన గ్రూప్ ఫొటో దిగి ఇస్తే.. వెంటనే వరద సాయం అందిస్తున్నారని పుకారు మొదలైంది. ఇందులో నిజా నిజాలు తెలియకుండా జనాలు ఎగబడి ఫొటో స్టూడియోల ఎదుట క్యూ కడుతున్నారు. చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో జనం పెద్ద ఎత్తున ఫొటోలు దిగడానికి ఎగబడుతున్నారు.. దీనిని ఆసరాగా చేసుకున్న ఫొటో స్టూడియో యజమానులు రెచ్చిపోతున్నారు.. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు దండుకుంటున్నారు. పోలీసులు ఇది ఫేక్ న్యూస్ నమ్మవద్దని చెబుతున్నా.. ఎక్కడ పదివేలు మిస్సవుతాయోనని జనం క్యూలో నుంచి కదలడం లేదు..